టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి తనదైన స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు.ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లో టిడిపిని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసేవారు. అలాగే బిజెపి లో ఉన్న టిడిపి సానుభూతిపరులు అందరినీ కట్టడి చేయడంలో వీర్రాజు సక్సెస్ అయ్యారు. తాజాగా ఆయన చంద్రబాబును బురద పాము తో పోల్చడం సంచలనంగా మారింది. చంద్రబాబు అవసరమైతే అప్పటికప్పుడు రాజకీయం చేస్తారని, కాళ్లు పట్టుకునేందుకు కూడా వెనకాడడు అని, ఇవన్నీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వీర్రాజు ఫైర్ అయ్యారు. 


బిజెపితో పొత్తు వద్దని చంద్రబాబు గతంలో ఏకపక్షంగా ప్రకటించారని,  కానీ ఆ తరువాత నాలుక కరుచుకుని సాయంత్రానికి మాట మార్చేశారని, వచ్చి మా కాళ్ళు పట్టుకున్నాడు అంటూ సంచలన విమర్శలు చేశారు. చంద్రబాబు తాచుపాము కాదని, బురద పాము అంటూ వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు తాచుపాము కాదని, ఆయన నైజం అలాగే ఉంటుందని, ఎంతో మంది వాడుకుని వదిలేశారని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ చదరంగం లో చంద్రబాబుకు ఇష్టమైన ఆట ఇదేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.


 తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు బిజెపిలో చేరిన సందర్భంగా వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటూ చెప్పగానే అద్వానీ , వాజ్ పేయ్ వంటి వారు రంగంలోకి దిగి, ఆయన రాజకీయాల్లో కొనసాగే విధంగా చేశారని, కానీ చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు అంటూ వీర్రాజు ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: