దుర్గగుడిపై కొండరాళ్ళు తరచూ జారిపడటం భక్తులు భయాందోళనకు గురవ్వటంతో శాశ్వత పరిష్కారం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం నిర్ణయించింది. కొండరాళ్ళు జారిపడకుండా ఉండటానికి పలు ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన నిపుణులు నవంబరు 2న కొండపై పర్యటించనున్నారు. అమ్మవారి ఆలయం చుట్టూరా ఉన్న కొండ ప్రాంతాన్ని పరిశీలించి కొండ చరియలు విరిగిపడకుండా ఏం చేస్తే బాగుంటుందో.. ఆయా అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఇంద్రకీలాద్రి కొండను పరిశీలిస్తే కొండంతా ఒకేరకంగా కాకుండా కొన్ని చోట్ల వదులైన రాళ్ళు, కొన్నిచోట్ల పగుళ్ళులేని కొండ రాళ్ళు ఉన్నాయి. ఎక్కువ భాగంలో మోత్తంగా, మట్ఠి మాదిరిగా రాళ్ళు ఉన్నాయి. కొన్ని రాళ్ళు ఒకదానిపై మరొకటి ఉండి పడిపోయేంత ప్రమాదకరంగా ఉన్నాయి. దీనితో కింది రాళ్ళను పైన ఉన్న రాళ్ళకి కలిపి బోల్టులు మాదిరి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

ఇక కొన్నిచోట్ల మట్టి మాదిరిగా వదులుగా ఉండే రాళ్ళున్నాయి. అక్కడ మరమత్తులు చేయాల్సి ఉంటుంది. చిన్న రాళ్ళు ఉన్న చోట చైన్ లింకు మెష్ వేసి క్రాంక్ లు బిగించాలి. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో సెన్సార్లను ఏర్పాటు చేస్తే ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే అలారం మోగి ముందుగానే ప్రమాదం గుర్తించవచ్చని భావిస్తున్నారు. కొండ మీద ఎక్కడెక్కడ ఎలాంటి రాళ్ళు ఉన్నాయి, ఎలాంటి ప్రమాదకర పరిస్థితులలో అవి ఉన్నాయనే విషయాలపై నిపుణుల బృందం పరిశీలన తర్వాత నివేదిక ఇవ్వనుంది. ఇప్పుడు ఈ నివేదక కూడ కీలకం కానుంది. దీని ఆధారంగానే రక్షణ చర్యలను కొండపై చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇటీవల దసరా ఉత్సవాలకు ముందు, దసరా ఉత్సవాల సమయంలో రెండు సార్లు కొండ చరియలు విరిగిపడి భక్తులను భయాందోళనకు గురిచేశాయి. ఇక ప్రభుత్వం కూడా ఉత్సవాల సమయంలో కొండరాళ్ళు జారి పడటంతో ఉలిక్కిపడింది.2006లో కొండ రాళ్ళు జారిపడకుండ కొండ చుట్టూ పలు చోట్ల 6 కోట్లు ఖర్చు పెట్టి ఇనుప వలలను ఏర్పాటు చేశారు. కానీ పెద్ద పెద్ద రాళ్ళు పడినపుడు ఈ వల ఆపలేకపోతోందని అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: