హిందూ సంప్రదాయంలో అవును గోమాతగా పూజిస్తారు. దేశంలో గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక ఈ సంవత్సరం దీపావళి పండగకు ప్రత్యేక ప్రమిదలను తయారు చేస్తున్నారు. అదేంటి అంటే గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి 'గోమయ దియా'గా పేరు పెట్టింది.

ఇక దేశవ్యాప్తంగా ఉన్న పాడిరైతులు, గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారుచేసిన ప్రమిదలు సరఫరా చేయాల్సిందిగా రాష్ట్రీయ కామధేను ఆయోగ్ పిలుపునిస్తోంది. ఈ పథకం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని, గో సంతతి వృద్ధితో పాటు వాటిపై ఆధారపడే వారికి ఆర్ధిక చేయూతనివ్వడం కూడా రాష్ట్రీయ కామధేను ఆయోగ్ లక్ష్యాల్లో ఒకటి అని సంస్థ అధ్యక్షులు వల్లభ్ కటారియా పేర్కొన్నారు. ఇక ఆవు పేడ ప్రమిదలకు ప్రస్తుతం మంచి డిమాండ్ బాగా పెరిగింది.

అయితే చిన్న స్థాయి కుటీర పరిశ్రమను రైతులే స్వయంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన తయారీ బిజినెస్ ఎలా ప్రారంభించాలి అనే సందేహాలు అందరికి వస్తూనే ఉంటుంది. నిజానికి ఇది కొత్త పద్ధతి ఏమీ కాదు. పాత తరం పిడకలతో ప్రమిదల తయారీ చేతులతో చేసేవారు. అయితే ప్రస్తుతం మెషిన్‌తో చాలా సులువుగా చేయవచ్చు. దీంతో నెల నెలా చక్కని ఆదాయం సంపాదించుకోవచ్చు.

అంతేకాదు ఈ ప్రమిదలను తయారు చేయడానికి ఆవు పేడ, బియ్యం పిండి, ఎర్ర మట్టిని ఉపయోగిస్తారు. పేడను పొడిగా చేసేందుకు cow Dung De-Watering Machine కూడా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా పొడిగా మారిన తర్వాత ఈ ప్రమిదలను తయారు చేసే పౌడర్ తయారువుతుంది. దీంతో ప్రమిదలను తయారు చేయవచ్చు. హోల్ సేల్ గా అయితే ఒక్కో ప్రమిద ఖరీదు 5 రూపాయలు కాగా, రిటైల్ లో అయితే ఒక్కో ప్రమిద రూ.10 పలుకుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు కింద, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ నుంచి గో ఉత్పత్తులకు రుణాలు అందిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: