రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారయింది.. తెలంగాణ లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ నాశనానికి కారణమైతే ఏపీ లో వైసీపీ పార్టీ అందుకు ఆజ్యం పోసింది.. అయినా కూడా కాంగ్రెస్ చెప్పే మాటలు చూస్తుంటే తొందరలోనే అధికారంలోకి వచ్చేలా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలంగాణాలో గట్టిగా 20 సీట్లు కొట్టలేని పార్టీ సైతం తమ గొంతు చించుకు అరవడం తెలంగాణ ప్రజలకు హాస్యాస్పదం అనిపిస్తుంది. గత ఎన్నికల్లో టీ ఆరేస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందనుకున్నా కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎవరు పట్టించుకోలేదు.

ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రస్థానం గురించి తప్పకుండా చెప్పాలి..రాష్ట్రము విడిపోయి తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ అని అందరికి తెలిసిందే.. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఈ పార్టీ పరిస్థితి ఏపీ లో దారుణంగా తయారైంది.. వరుసగా రెండో సారి ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకపోవడంతో పార్టీ క్యాడర్ ఢీలా పడిపోయింది.. అయితే ఇక్కడి నేతలు ప్రతి పక్షం లో ఉంటూ అధికార పార్టీ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.. నిజానికి రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా సమాధి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి గురించి మాట్లాడ్డం హాస్యాస్పదమే అవుతుంది. ఏపీ కాంగ్రెస్ ని మీడియా పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది.

టీవీ చర్చల్లో అసలు కాంగ్రెస్ నేతలకు స్థానమే లేదు, కనీసం పేపర్లలో కూడా కాంగ్రెస్ వార్తలు కనిపించవు. అయినా కూడా సీనియర్లు కొంతమంది కాంగ్రెస్ ని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి వారంతా ఇప్పుడు అమరావతి వద్దకు చేరుకున్నారు.అక్కడ ప్రజలను సానుభూతి తో తమవైపు కు తిప్పుకోవాలని చూస్తున్నారు.. అమరావతి కి లబ్ది రావాలని అప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ను ఇచ్చిందని అంటున్నారు.. ఎంతో కష్టపడి అమరావతి ని రాజధాని చేస్తే ఇప్పుడు తరలించడం అన్యాయం అని అంటున్నారు. మెల్లగా అమరావతిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మీకు నాయకులు లేరు, మాకు జనం లేరు అంటూ కాంగ్రెస్ నాయకులు అమరావతి ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. ఢిల్లీ స్థాయిలో మీ తరపున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఎలాగూ సీట్లు లేవు కాబట్టి.. పార్లమెంట్ లో తాడో పేడో తేల్చుకుంటామంటూ సవాళ్లు విసిరారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని, అమరావతిని రాజధానిగా ఉంచి మిగతా ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కి ఉచిత సలహా పారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: