రాజకీయాలు చేయాలనీ ఎవరికైనా ఉంటుంది.. ఇది ఓ వర్గం వారికి, ఓ వయసు వారికి, ఓ కులం వారికి అన్న తేడా ఏం లేదు.. ప్రజల ఆదరణను బట్టి ఓ మాములు మనిషి నాయకుడవుతాడు.. ఆ నాయకుడి కి సరైన పార్టీ దొరికితే ఆయనకు ఇంకా తిరుగుండదు.. రాజకీయ నాయకుడు ప్రజల్లో ఎక్కువగా ఉంటే చాలు ఏ పార్టీ అయినా పిలిమరీ సీటిస్తుంది.. అయితే ఎస్సీ వర్గం రాజకీయ నాయకుల విషయంలో కొంత ఆందోళన చెందుతున్నారు ప్రజలు.. ఏ పార్టీ లో ఉన్నా, ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ వర్గం రాజకీయ నాయకులూ తేలిపోతున్నారు.. ఎందుకో తెలీదు కానీ ముఖ్యంగా ఏపీ లో ఈ ఎస్సీ వర్గం నాయకులూ కొన్ని రోజులకే రాజకీయాలకు పరిమితమై ఆ తరువాత కనుమరుగైపోతున్నారు.

ఇతర వర్గం నాయకులూ దూసుకుపోతుంటే వీరు మాత్రం ఉన్న చోట కదలకుండా ఉంటూ తమకు భవిష్యత్ లేకుండా చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు చుక్కలు కన్పిస్తున్నాయి. అక్కడి ఇతర సామజిక వర్గ నేతలు వారిని టార్గెట్ చేయడమే దీనికి కారణంగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావెల కిశోర్ బాబుపై ఒక సామాజికవర్గం పెత్తనం చేసి ఏకంగా మంత్రివర్గం నుంచి తప్పించగలిగింది. రంపచోడవరంలో వంతల రాజేశ్వరిని అప్పట్లో టీడీపీ నేతలు ఎమ్మెల్యేగానే చూసేవారు కాదు.కోడుమూరు నియోజకవర్గంలో మణిగాంధీని అక్కడ విష్ణువర్థన్ రెడ్డి వేపుకు తినేవారు.వీరంతా వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసినవారే కావడం విశేషం.

ప్రస్తుతం వైసీపీ లో కూడా ఈ వర్గం నాయకుల అణిచివేత జరుగుతూనే ఉంది. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి వైసీపీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. తొలిసారి గెలవడం, అందులో మహిళ ఎమ్మెల్యే కావడంతో ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇటీవలే ఆమె నలుగురి తో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోడుమూరు నియోజకవర్గంలో, నందికొట్కూరు నియోజకవర్గంలో,  పాయకరావుపేటలో, ఇలా ఇంకొన్ని నియోజక వర్గాల్లోని నేతలను టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. వీరు చంద్రబాబు, ఇటు జగన్ పాలనలో ఇబ్బంది పడుతుండడం భవిష్యత్ పెద్ద వివాదానికి తెరతీసేలా ఉంది. ఇంత జరుగుతున్నా జగన్ నిమ్మకు నీరెత్తకుండా ఉండడం , అగ్రకులాలకే అండగా నిలుస్తుండగంతో వారిలో ఆందోళన మొదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: