అమెరికా కొత్త ప్రెసిడెంట్ ఎవరో జనం తీర్పు ఇచ్చేశారు. ట్రంప్ పాలన మాకు వద్దు అని కూడా తేల్చేశారు. మాకు బైడెన్ కావాలని ఓట్లు గుద్ది మరీ గట్టిగా నినదించారు. ఇక జనవరి 20 బైడెన్ ప్రమాణం అంటే  మరో అరవై రోజులు సమయం గట్టిగా ఉంది. శ్వేత సౌధంలో ప్రవేశించడానికి 78 ఏళ్ల బైడెన్ రెడీ అవుతున్నారు. కానీ నేను ఇంకా ఓడలేదు అని రంకెలు వేస్తున్నాడు ట్రంప్.  బైడెన్ గెలిచింది కూడా లేదు అనేస్తున్నాడు.

అసలే ఆయన డొనాల్డ్ ట్రంప్. ఆయన స్టైలే వేరుగా ఉంటుంది. అమెరికాకు ఎందరో ఘనత వహించిన వారు ప్రెసిడెంట్లు అయ్యారు. కానీ ట్రంప్ లెక్క వేరు. ఆయన బాడీ లాంగ్వేజ్ వేరు వేరు. ఆయన వ్యవహార శైలి వేరు. రచ్చ రచ్చ చేస్తున్న ట్రంప్ ఇపుడు బైడెన్ ఎన్నిక మీదనే వివాదం రేపుతున్నాడు. నేనే గెలిచాను. బైడెన్ గెలుపు మోసపూరితం అంటున్నాడు.

ఇక బైడెన్ కి తన సీటుని తిన్నగా అప్పగించేందుకు కూడా ట్రంప్ ఇప్పటికీ సిధ్ధం కావడంలేదు. ఈ పరిణామంతో బైడెన్ వర్గీయుల్లో ఆందోళన ఒక్కసారిగా పెరిగిపోతోందిట. మరో వైపు తన పార్టీకి చెందిన వారిని పిలిపించుకుని ట్రంప్ బైడెన్ మీద కుట్ర రాజకీయాలు మొదలెట్టారని ప్రచారం గట్టిగా సాగుతోంది. బైడెన్ గెలిచిన సెగ్మెంట్లను తనకు అనుకూలం చేసుకునేలా కొత్త ఎత్తులు వేస్తున్నాడు అంటూ వార్తలు అయితే ప్రచారంలోకి వస్తున్నాయి.

మరి ఇవి ఎంత నిజమో అబద్దమో తెలియదు కానీ 306 ఓట్లు సాధించి ఫుల్ మెజారిటీతో బైడెన్ వైట్ హౌస్ వాకిట నిలబడి ఉంటే ఆయన్ని ప్రెసిడెంట్ కానిచ్చేది లేదు అని ట్రంప్ పట్టుపట్టడం మాత్రం కొత్త వివాదానికి దారితీసేలా ఉందిట. మరి అన్నీ సవ్యంగా సాగిపోయి బైడెన్ వైట్ హౌజ్ లో కూర్చునేది ఉందా అన్నది ఇపుడు అమెరికాలో కొత్త చర్చట. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: