టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు  రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మూర్ఖపుప్రభుత్వం సైకోయిజంతో ముందుకెళుతోంది అని మండిపడ్డారు. చట్టాలకు విరుద్ధంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా చేపట్టే చర్యలను కోర్టులు తప్పుపడతాయి అని విమర్శించారు. దేశంలో ఏ ప్రభుత్వానికి పడని విధంగా, కోర్టులచేతిలో చీవాట్లు, మొట్టికాయలు పడ్డాకూడా రాష్ట్రప్రభుత్వ పద్ధతి మారకపోతే ఎలా? అని నిలదీశారు.     విశాఖపట్నం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని, ఎయిర్ పోర్ట్ లో పోలీసులతో అడ్డుకున్నందుకు హైకోర్టు నిన్న ప్రభుత్వానికి ఎలా అక్షింతలు వేసిందో చూశాం కదా? అని ప్రశ్నించారు.

అధికారపార్టీ మంత్రి చెప్పాడనో... మాజీమంత్రి చెప్పాడనో పోలీసులు ఆనాడు అతిగాప్రవర్తిస్తే, నేడు కోర్టు ఆదేశాలతో ఏసీపీ సస్పెండ్ అయ్యాడు అని విమర్శించారు. సొంత బాబాయి హత్యకేసు నిందితులు తాడేపల్లికి వస్తూపోతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. 60 ఏళ్ల పాటు ఉద్యోగాల్లో ఉండాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, 5 ఏళ్ల పాటుండే ప్రభుత్వాలు చెప్పినట్లు వింటే చివరకు ఏమవుతుందో, రాష్ట్రంలోని పోలీసులను చూస్తే అర్థమవుతోంది అని విమర్శించారు.

తూర్పుగోదావరి జిల్లాలోని శిరోముండనం  కేసులో అత్యుత్సాహం ప్రదర్శించినందుకు ఒక ఎస్సై జైలుకెళ్లాడు అన్నారు. గుంటూరులో చీరాల ఎస్సై, మరో సీఐది అదే పరిస్థితి అన్నారు. రాష్ట్రం పరువు అంతర్జాతీయ స్థాయిలో మంటగలుస్తున్నా, ఈ సైకో ప్రభుత్వానికి పట్టడం లేదు అని మండిపడ్డారు. ఇసుకలో ఇప్పటివరకు దోచుకున్నది చాలక, శాండ్ కార్పొరేషన్ పేరుతో ఏపీలోని ఇసుక రీచ్ లను రెడ్డి అండ్ కంపెనీకి కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు అని మండిపడ్డారు. ఈ  18నెలల్లో కేవలం లిక్కర్ వ్యాపారంపైనే రూ.5వేల కోట్ల వరకు కొట్టేశారన్నారు. పేదలకు సెంటు స్థలం పేరుతో, రూ. 10లక్షల విలువ చేయని భూములను, రూ.70 లక్షలు, రూ.80 లక్షలకు కొని, రూ.4వేల కోట్ల వరకు దోచేశారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: