ఇటీవల ఫ్రాన్స్  తో పాకిస్తాన్ వివాదం పెట్టుకుంది అనే విషయం తెలిసిందే . పాకిస్తాన్లో రాడికల్ టెర్రరిజాన్ని సహించేది లేదని  రాడికల్ టెర్రరిజాని కి పాల్పడుతున్న వారిని ఎక్కడి కక్కడ కాల్చి పారేయాలి అంటూ ఫ్రాన్స్  ఆదేశాలు జారీ చేయడాన్ని తప్పు పట్టిన పాకిస్తాన్ ఏకంగా  ఫ్రాన్స్ అధ్యక్షుడి కి సైతం వార్నింగ్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో పాకిస్తాన్ తీరు పై ఫ్రాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అన్న విషయం తెలిసిందే. అంతటి తో ఆగని పాకిస్తాన్ ఏకంగా  పాకిస్తాన్ లో ఉన్న ఫ్రాన్స్ కు సంబంధించిన దౌత్య పరమైన కార్యాలయాన్ని ముట్టడించి.. నినాదాలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారి పోయింది.



 అయితే పాకిస్తాన్ లో ఉన్న ఫ్రాన్స్ దౌత్య కార్యాలయం పై దాడి చేసిన ఘటనలో అటు  యూరోపియన్ దేశాల తప్పు పడుతున్న నేపథ్యం లో పాకిస్థాన్ పై  కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవు తున్నాయి. ఈ క్రమం లోనే ఫ్రాన్స్ దెబ్బకు అటు పాకిస్థాన్ వణికి  పోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మొత్తం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో నే లష్కరే తోయిబా చీప్ ను అరెస్టు చేసి  జైలు శిక్ష విధించారు.




 ఇక ఇటీవల ఎవరైతే ఫ్రాన్స్ రాయబార కార్యాలయం దగ్గర హడావిడి చేసి చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నించారో.. వాళ్లను అరెస్టు చేసేందుకు కూడా ఇమ్రాన్ ఖాన్  ప్రభుత్వం ప్రస్తుతం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు ఫ్రాన్స్ వస్తువుల బహిష్కరణ ను కూడా చేయడం లేదు అంటూ స్పష్టం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. అంతేకాకుండా ప్రాన్స్ వ్యతిరేక ఉద్యమం లో కీలక పాత్రధారి అయిన.. నాయకుడు ఖాదీమ్  హుస్సేన్ రాజ్వి ని  ఎవరో కాల్చి చంపారు. ఇది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: