ప్రతి దేశానికి కూడా ఒక ప్రత్యేకమైన కరెన్సీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆయా దేశాల కరెన్సీ విలువను అగ్రరాజ్యమైన అమెరికా కరెన్సీ తో పోల్చి చూస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్య మార్కెట్ మొత్తం అగ్రరాజ్యమైన డాలర్ కరెన్సీ తోనే జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ విలువను కూడా డాలర్ కరెన్సీ తోనే లెక్క కడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు వరకు ప్రపంచ దేశాలన్నింటికీ కరెన్సీతో డాలరు కరెన్సీ విలువ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక డాలర్ తర్వాత యూరో రెండవ స్థానం లో అత్యంత విలువైన కరెన్సీగా ఉంటుంది




 కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డాలర్  వినియోగం తగ్గి యూరో వినియోగం క్రమక్రమంగా పెరిగి పోతున్నట్లు సమాచారం. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వినియోగంలో ఉండే డాలర్  వినియోగం తగ్గి పోయి యూరో వినియోగం పెరిగి పోతుందట. 2013 తర్వాత... డాలర్ కంటే యూరో అత్యధికంగా వినియోగంలోకి వచ్చింది అన్నది గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా మార్కెట్లో దెబ్బతినడం సహా మరికొన్ని కారణాలతోనే ప్రస్తుతం యూరో ఎక్కువగా వాడకంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.



 అయితే ఇప్పుడు వరకు ఆర్థిక వ్యవస్థ లో మొట్టమొదటి సారి ఇలాంటి మార్పు చోటు చేసుకుంది అని విశ్లేషకులు అంటున్నారు ఇప్పుడు వరకు ఎన్నో దశాబ్దాల నుంచి డాలర్ మొదటి స్థానంలో కొనసాగుతూ ఎక్కువ వినియోగంలో ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన జో బైడెన్  కు ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో ఇదే తీరు కొనసాగితే అమెరికా మార్కెట్ లు  భారీగా దెబ్బతినే అవకాశం ఉందని ఇది జో బైడెన్ కు ఒక పెద్ద సవాల్ అని అంటున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: