కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్ణయం తీసుకుని కాశ్మీర్ ప్రాంతంలో ఎన్నో దశాబ్దాల నుంచి  కొనసాగుతూ వస్తున్న 370 ఆర్టికల్ రద్దు చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికింది అన్న విషయం తెలిసిందే.  అప్పుడు వరకు భారతదేశం భూభాగం అయినప్పటికీ ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉన్న కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో ఒక భాగంగా మార్చింది  కేంద్ర ప్రభుత్వం. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో పరిణామాలు శరవేగంగా మారి పోతున్నాయి  అనే విషయం తెలిసిందే.



 కాశ్మీర్ ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మారుమూల గ్రామాల ప్రాంతాల కు సైతం ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రస్తుతం మొన్నటి వరకు పాకిస్తాన్ ప్రజలం అని అనుకున్న కాశ్మీర్ వాసుల ను భారత ప్రజలం  అనుకునే చేస్తుంది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఇప్పటికి కూడా బీజేపీయేతర పార్టీలు కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయి లో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాశ్మీర్ లో ఎన్నో రకాల వ్యవస్థలు కూడా పని చేస్తున్నాయి. అందులో అవినీతి నిరోధక శాఖ తో పాటు మరికొన్ని రకాల శాఖలు కూడా పనిచేస్తున్నాయి.




 ఈ క్రమంలో నే కాశ్మీర్లో ని బీజేపీయేతర పార్టీలు ఒక్కటై ఓ  స్టేట్మెంట్ ఇచ్చారు. తమకు ఓట్లు వేసి గెలిపిస్తే 370 ఆర్టికల్ ని మళ్లీ తీసుకు వస్తామని.. అక్కడి ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ఇక ఇటీవలే ఇదే విషయం పై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. భవిష్యత్తు లో ఆర్టికల్ 370  పునరుద్ధరణ అనేది ఎవరి వల్ల కాదు... ఎవరిని చేయనివ్వమూ  కూడా.. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసేందుకు ముందుకు వస్తే సహించేది లేదని భారత ప్రజలు కూడా ఊరుకోరు అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: