ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా పట్టుదలతో ఉన్నారు. ఏదో రకంగా తాను రిటైర్ అయ్యేనాటికి ఎన్నికలు నిర్వహించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.సుప్రీంకోర్టు వరకు వెళ్లి మరి తన పదవిని కాపాడుకుంటున్నారు. నిమ్మగడ్డ ఏదోరకంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న,  వైసీపీ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో అధికారులు వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న లేకపోయారు. ఇదే విషయమై రెండుసార్లు ఏపీ సిఎస్ నీలం సాహ్ని కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలు రాసినా, ప్రయోజనం మాత్రం కనిపించలేదు. 


.
అదీ కాకుండా,  అసలు ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన వాతావరణం లేదని, తాము సహకరించ లేము అని సీఎస్ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2016లో ఏపీ ఎన్నికల అధికారి గా నియమితులయ్యారు. 2021 మార్చి  తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. తన పదవీ కాలంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అనేది పెద్ద సాహసమే అని చెప్పాలి. ఎన్నికలను నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నా, స్థానిక ప్రభుత్వం దానికి సహకరించాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము విధులు నిర్వహించలేము అని ఏపీఎన్జీవోల సంఘం నేతలు చెబుతుండడం, నిమ్మగడ్డకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఏదో హడావిడిగా ఎన్నికలు తంతుగా ముగించేయాలి అంటే అది కుదరని పని. అధికారులు అంతా తగిన విధంగా సహకారం అందిస్తే తప్ప,  ఇంత పెద్ద ఎన్నికల తంతు ముగించే అవకాశం లేదు.



ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ వంటి ప్రాంతాలలో కూడా థర్డ్ వేవ్ మొదలవడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే అక్కడ లాక్ డౌన్ విధించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి అన్నీ నిమ్మగడ్డ నిర్ణయానికి ఇబ్బందికరంగా మారాయి. డిసెంబర్ లో ఎన్నికల తంతు మొదలు కాకపోతే జనవరి లో పండుగలు, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మార్చిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ అవుతుండడంతో ఆయన ఆశ తీరేలా కనిపించడం లేదు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వైసిపి ప్రభుత్వం ఈ విధంగా చక్రం తిప్పుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: