దేశంలో క్రైమ్ రేట్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎదోఒక్క ప్రాంతంలో ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మరికొంత మంది చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆస్తి తగాదాలతో ఒక్కరు చనిపోతే, అక్రమ సంబంధాల కారణంగా మరొక్కరు, ప్రేమ విఫలమై మరికొంత మంది, పరువు కోసం ఇలా ఎంతోమంది ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలను విడుస్తున్నారు. ఇలాంటి కోణంలోనే తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది.

ప్రేమ ఇద్దరిని ఒక్కటి చేసింది. కానీ కులాలు వేర్వేరు కావడమే వారి ప్రేమపాలిట శాపంగా మారింది. కలిసి బతికేందుకు పెద్దలు అంగీకారం చెప్పకపోవడంతో విడిపోయి బతకడం ఇష్టం లేక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ అత్యంత విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మాదమంగల గ్రామానికి చెందిన యువకుడు సురేష్(28), కరహళ్లికి చెందిన యువతి రూప(26) కొన్నేళ్లుగా ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకుంటున్నారు. వారు వివాహ బంధంతో ఒక్కటి కావాలని ఆశించారు. అయితే ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడం వారి ప్రేమకు శాపంగా మారింది. దళిత వర్గానికి చెందిన సురేష్‌, బీసీ వర్గానికి చెందిన రూప వివాహానికి పెద్దలు అంగీకారం తెలుపలేదు. కులాంతర వివాహానికి ఇరుకుటుంబాలు నిరాకరించడంతో ప్రేమ జంట మనస్థాపానికి గురైంది. కలిసి బతకలేక.. విడిచి ఉండలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఇద్దరు బంగారపేట మండలం ముగిలబెలిలోని వ్యవసాయ నీటికుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక ప్రేమికులిద్దరూ ఒక్కటిగా నీటి కుంటలో మునిగి ప్రాణాలు తీసుకున్నారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికుల సాయంతో యువతీయువకుల మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: