‘టీ’ ప్రేమికులు ఉండని వారుండరూ.. ఉదయాన్నే లేవగానే టీ తాగి తమ రోజును ప్రారంభించేవాళ్లు చాలానే ఉంటారు. కేవలం ఇంట్లోనే పరిమితం కాకుండా.. స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు సరదాగా బాతాఖాని కొడుతూ టీ తాగడం అందరికీ అలవాటు. టీ తాగడం మనలో చాలా మందికి అలవాటే. ఆఫీస్ లో వర్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు కొంచెం రిలీఫ్ అవ్వడానికి టీ తాగేస్తుంటాం.

అయితే మనం తాగే టీ ధర ఎంత ఉండొచ్చు. మహా అంటే రూ.5 నుంచి మొదలుకుని రూ.20 వరకు ఉండొచ్చు. అదే కాస్టీ రెస్టారెంట్లలో రూ.100 దాకా ఉండొచ్చు. కానీ ఒక స్టాల్ లో మాత్రం కప్పు టీ రూ.1,000 అంట. ఇది నిజం. నమ్మ బుద్ధి కావడం లేదు కదూ. కానీ ఆ టీకి అంత డిమాండ్. ఆ టీలో ఏం కలుపుతారు? అసలేందుకు ఆ చాయ్ కి అంత రేటు అనేగా ప్రశ్న..

కోల్ కతాలో గంగూలీ టీ స్టాల్ తెలియని వారుండరూ. ఎంతో ఫేమస్ టీ స్టాల్ అది. రెస్టారెంట్ల మాదిరిగా సపరేట్ బిల్డింగ్ అంటూ దానికి లేదు. కేవలం రోడ్డు పక్కనే టీ స్టాల్ పెట్టుకుని నడుపుతుంటాడు పార్థ ప్రతిమ్ గంగూలీ. గతంలో గంగూలీ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. కానీ అతడికి టీ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఉన్న ఉద్యోగాన్ని రాజీనామా చేసి టీ స్టాల్ పెట్టుకున్నారు.

2014వ సంవత్సరంలో గంగూలీ టీ స్టాల్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. ముకుంద్ పూర్ లో నిర్జాస్ టీ పేరిట టీ స్టాల్ రన్ చేశాడు. ఒక రకంగా అది టీ బార్ లాంటిదనే చెప్పుకోవచ్చు. ఈ టీ స్టాల్ లో ప్రపంచవ్యాప్తంగా లభించే 115 రకాల టీలు అందుబాటులో ఉంటాయి. కేజీకి రూ.2.8 లక్షలు పలికే జపాన్ స్పెషల్ టీ సిల్వర్ నీడిల్ వైట్ టీ రూ.50 వేల నుంచి రూ.32 లక్షల వరకు పలికే బో-లే టీ కూడా దొరుకుతుంది.

చమోమైల్టీ టీ కేజీ రూ.14,000, హిబిస్కస్ టీ కేజీ రూ.7,500, రూబియస్ టీ కేజీ రూ.20,000, ఒకాయ్టి టీ కేజీ రూ.32,000, లావెండర్ టీ కేజీ రూ.16,000, బై ముదాన్ టీ కేజీ 20,000 వరకు దొరికే టీలు గంగూలీ స్టాల్ లో దొరుకుతాయి. వీటితోపాటు చాకొలేట్, వైట్ టీ, మైజ్ టీ, బ్లూ టీతో పాటు రూ.14కే దొరికే యెర్చా టీ కూడా అమ్ముతుంటాడు. టీతో పాడు టీ పౌడర్ ను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తుంటాడు. ఈ ప్రీమియం టీలకు అంత ధర పెట్టి తాగడం ఎక్కువ ధరేమీ కాదని గంగూలీ అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: