పార్టీ ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు చాలాకాలం వరకు అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చెప్పాలి.. ఎందుకంటే గత రెండేళ్లుగా ఎప్పుడు కూడా అయన పార్టీ ని చక్కదిద్దుపెట్టుకోవాలనే ఆకాంక్ష ఎక్కడా కనిపించలేదు.. అమరావతి పోరాటం, జగన్ ని విమర్శించడమే ఆయనకు సరిపోయాయి..కనీ ఎక్కడ కూడా దిశ తప్పిన పార్టీ ని గాడిలో పెట్టుకోవాలనిఅనుకోలేదు. అలాంటిది ఇటీవలే పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ లను నియమించి పార్టీ ని బాగుచేయడానికి మొదటి ప్రయత్నం అయితే  మొదలు పెట్టారు..  రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు గానూ ఇన్ చార్జ్ లను నియమించి సంచలనం రేకెత్తించారు..

అన్ని వర్గాలకు సమన్యాయం చేకూర్చి అయన ఇన్ చార్జ్ ల నియామకంలో విజయం సాధించారని చెప్పొచ్చు.. అయితే పరిటాల కుటుంబాన్ని మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబు.. టీడీపీ పార్టీ అభివృద్ధి కి పరిటాల కుటుంబం చేసిన కృషి అంతా ఇంతాకాదు.. రాజ‌కీయంగా ఆర్థికంగా కూడా పార్టీకి ప‌రిటాల ఫ్యామిలీ ద‌న్నుగా నిలుస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రెండు టికెట్లు అడిగితే.. చంద్రబాబు రాప్తాడు ఒక్కటే శ్రీరాంకు ఇచ్చారు. ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత నుంచి చంద్రబాబు ఈ కుటుంబాన్ని ప‌ట్టించుకోలేదు.

తొలి సారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి చిత్త‌య్యాడు ప‌రిటాల శ్రీరామ్. అలా వారి కంచుకోట బ‌ద్ధ‌లు కావ‌డంతో.. క‌థ మారింది. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ప‌రిటాల ఫ్యామిలీ రాజ‌కీయంగా చాలా కామ్ అయిపోయింది. ఎలాంటి యాక్టివిటీస్ లేవు. ఒక‌వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ప‌థ‌కాల‌తో జ‌నాన్ని త‌మ వైపుకు తిప్పుకుంటుంటే... టీడీపీ వాళ్లు మాత్రం ఇళ్ల‌కు ప‌రిమితం అయిన నియోజ‌క‌వ‌ర్గాల్లో రాప్తాడు ఒక‌టి.రాప్తాడులోనే నిమ్మ‌కు నీరెత్తిన ప‌రిటాల ఫ్యామిలీ, ధ‌ర్మ‌వ‌రం గురించి ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేదు. ఇక పార్టీ నియామ‌కాలు, క‌మిటీల్లో కూడా ప‌రిటాల ఫ్యామిలీకి చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి ప్రాధాన్య‌త‌నూ ఇవ్వ‌లేదు. ఈ ప‌రిణామాల్లో ఇంత‌కీ ప‌రిటాల కుటుంబం టీడీపీలో ఉన్న‌ట్టా, లేక రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న‌ట్టా? అనేంత స్థాయిలో సందేహాలు తలెత్తుతుండ‌టం గ‌మ‌నార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: