తెలంగాణాలో రాజకీయ చాణక్యుడిగా కేసీఆర్ కి మంచి పేరుంది.మంచి వాగ్దాటి ఉన్న అతి తక్కువ రాజకీయ నాయకుల్లో అయన ఒకరు.  అయన మాట్లాడితే ఎంతటి శత్రువు అయినా యిట్టె కరిగిపోతారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో ఆయనకు ఆయనే సాటి అందుకే తెలంగాణ ఉద్యమంలో అయన విజయం సాధించారు.. ఇప్పుడు రెండు సార్లు అధికారంలోకి వచ్చారు.. ఎదుటి వారిని విమర్శించేటప్పుడు కొంచెం చతురత మిళితం చేసి ప్రజలను ఆకట్టుకోవడం కేసీఆర్ కి అలవాటు.. ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా ఎదుటి వారిమీద కామెడీ పంచ్‌లు మాంచి ఈజ్‌తో వేయడంలో  కేసీఆర్ కి పరిపాటి ఎవరు లేరు..

అయితే ఇదే పద్ధతి ని ఫాలో అవుతున్నారని బీజేపీ నేతల పోకడను చూస్తే అర్థమవుతుంది. తెలంగాణాలో సక్సెస్‌ సాధించేసిన టీఆర్‌ఎస్, ఆ పార్టీ నాయకులు అనుసరించే దారినే ఇతర పార్టీల నాయకులు ఇప్పుడు ఫాలో అవుతున్నారని ఓ నివేదిక లో వెల్లడైంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ నేతలు కేసీఆర్ స్పీచ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని టీ ఆర్ ఎస్ కే వ్యతిరేకంగా ఈ అస్త్రాన్ని సంధించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే దుబ్బాక లో గెలుపుతూ మంచి ఆత్మవిశ్వాసం తో ఉన్న బీజేపీ  కేసీఆర్‌ను, ఆయన బృందాన్ని పలుచన వేసే విధంగా వాగ్భాణాలు సంధిస్తున్నారు. తద్వారా ప్రజల్లో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా తామే ఉన్నామన్న ధీమాను కల్పించేందుకు తీవ్రంగానే పాటుపడుతున్నారు.

కేవలం 13 రోజుల్లోనే గ్రేటర్‌ ఎన్నికలు ముగించేసే విధంగా టీఆర్‌ఎస్‌ రాజకీయ చతురతను చాటుకుంది. ఇంత తక్కువ టైం ఇతర పార్టీ లు ఎన్నికలకు ఎలా సిద్ధమవుతాయనేది అసలు ప్రశ్న కాగా కేసీఆర్ నిర్ణయం ప్రత్యర్ధి పార్టీలకు అసలు అభ్యర్ధుల జాబితాలనే సిద్ధం చేయలేనంతటి పరిస్థితిని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉన్న తక్కువ టైమ్‌లోనే ప్రజల్లోకి మరింతగా దూసుకువెళ్ళేందుకు తగిన మార్గాలను ఆయా పార్టీలు వెతుక్కుంటున్నాయి. ఇదే ప్రయత్నంలో రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరమైన, గుర్తు పెట్టుకోదగ్గ రీతిలోనే ఎన్నికల ప్రసంగాలు ఉండబోతున్నాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: