ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఆసక్తి కరంగానే ఉంటాయి.. విపక్షాలు, అధికారపార్టీ లమధ్య ఎప్పుడు ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే జగన్ అధికారంలో కి వచ్చిన తరవాత రాష్ట్రంలో వివాదాల సంఖ్యా ఎక్కువైందని చెప్పొచ్చు.. వచ్చి రాగానే అవినీతి పరులైన టీడీపీ నేతలను జైలుకి పంపి వివాదాలకు ఆజ్యం పోశారు.. ఆ తర్వాత మూడు రాజధానుల వివాదం, ఆ తరువాత కోర్టుల వ్యవహారం, ఇప్పుడు పోలవరం విషయం ఇలా ఒకదానికి తరువాత ఒకటి వచ్చి ప్రజలను ఊపిరి తీసుకోనివ్వకుండా చేస్తున్నాయి ఈ వివాదాలు. ఈ దెబ్బ తో ఏపీ లో పేరు కూడా దేశంలో మార్మోగిపోతోంది..

ఇక ఏపీ లో అందరికి తిరుపతి ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠభరితంగా మార్చేస్తుంది..  ఇక్కడ గెలుపుకోసం వైసీపీ, టీడీపీ లతో పాటు బీజేపీ కూడా పోటీ చేస్తున్నాయి.. తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి గడిచిన సాధారణ ఎన్నికల్లో బల్లి దుర్గా ప్రసాద్ ఘన విజయం సాధించారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమీప ప్రత్యర్థి పనబాక లక్ష్మిని సుమారుగా 2.4లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే ఏడాదిన్నర గడిచిన తర్వాత ఆయన అనూహ్యంగా కరోనా సోకడం, అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీడీపీ ఇప్పటికే పనబాక లక్ష్మి ని ఇక్కడ అభ్యర్థి గా ప్రకటించారు.. వైసీపీ ఆలస్యం చేస్తే వీక్ అయిపోతాని చెప్పి ఇక్కడ అభ్యర్థి ని ప్రకటించారు.  బాపట్ల ఎంపీ స్థానం నుంచి నందిగమ సురేష్ కి అవకాశం ఇచ్చినట్టే ఈసారి తిరుపతి నుంచి గురుమూర్తికి ఛాన్స్ దక్కుతోంది. అని అంటున్నారు.

బల్లి దుర్గా ప్రసాద్ తనయుడు చైతన్యకే ఛాన్స్ అంతా భావించారు. కానీ అనూహ్యంగా మృతి చెందిన ఎంపీ కుటుంబం నుంచి బరిలో దిగే వారి పట్ల సానుభూతితో పోటీకి దూరంగా ఉండాల్సిన ప్రతిపక్ష టీడీపీ ఆనవాయితీని పక్కన పెట్టేసింది. అధికార పార్టీ అభ్యర్థిని ఖరారు చేయకముందే తన పార్టీ తరుపున పనబాక లక్ష్మి మరోసారి పోటీలో ఉంటారని ప్రకటన చేసింది. దాంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన జగన్ తాజాగా తన అభ్యర్థిగా గురుమూర్తిని తెరమీదకు తెచ్చారు. దీంతో బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబలో వారికీ కాకుండా వేరొకరికి టికెట్ ఇవ్వడం కొంత ఆందోళన కలిగిస్తుంది వైసీపీ నేతలకు. అదే సమయంలో బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఖాయం చేశారు. వచ్చే మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి అవకాశం ఇచ్చేందుకు ఒప్పించారు.  మరి జగన్ ఈ రిస్క్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: