బిగ్ బాస్ షో జనాల్లో ఎంత క్రేజ్ ను తెచ్చుకుంది అంటే మాటల్లో చెప్పలేనిది.. మూడు సీజ న్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో సీజన్ ను తెలుగు లో జరుపుకుంటుంది.. వంద రోజుల ప్రయాణంలో ఈ షో లో ఎన్నో గొడవలు కొట్లాటలు ముఖ్యంగా రొమాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ షో ఒక  ఫుల్ ఆఫ్ ఎంటర్టైనర్ అని చెప్పాలి.. నిన్నటి దాకా చుడాటానికి మాత్రమే పనికి వచ్చిన ఈ షో ఇప్పుడు ఆపరేషన్లు చేయడానికి కూడా ఉపయోగ పడుతుంది.. మీరు విన్నది నిజమే.. వివరాల్లోకి వెళితే..



గుంటూరు కొత్తపేటలోని బ్రింద న్యూరోసెంటర్‌‌ డాక్టర్లు అరుదైన శస్త్ర చికిత్స గురించి తెలుసుకోవాల్సిందే.గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం, పాటిబండ్ల గ్రామానికి చెందిన యువ సాప్ట్‌వేర్ ఇంజనీర్ బత్తుల వరప్రసాద్‌ బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతనికే నాలుగేళ్ల క్రితం మెదడులో ట్యూమర్‌ ఏర్పడటంతో హైదరాబాద్‌లోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కణితను తొలగించారు. ఆ తరువాత అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఇటీవల వరప్రసాద్‌‌కి ఫిట్స్ వచ్చి పడిపోవడంతో.. గుంటూరు నగరంలోని బ్రిందా న్యూరో సెంటర్‌కు తరలించారు. అతన్ని పరీక్షించిన సీరియర్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి.. వరప్రసాద్ మెదడులోని ఫంక్షనల్‌ ఏరియాలో 3 సెంటీమీటర్ల సైజులో కణిత ఉన్నట్లు ఒక స్కాన్ ద్వారా వెల్లడించారు..



ఈ కణత ఉన్న భాగంలో కాళ్ళకి , చేతులకు ఉన్న నరాలు ఉన్నాయి.. రోగి కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండాలి. అందుకే అతనికి మత్తు ఇవ్వలేదు..కాగా , డాక్టర్లు కొత్త ఆలోచనలూ చేశారు..మెదడు ప్రాంతానికే మత్తు మందు ఇచ్చి మిగతా శరీరమంతా స్పృహలో ఉండేటట్లు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో అతనికి ఆపరేషన్ అంటే భయం పోగొట్టడానికి తననికి ఇష్టమైన నాగార్జున ‘బిగ్ బాస్ ’ షోని ఆపరేషన్ థియేటర్‌లో లాప్ ట్యాప్‌లో చూపించారు డాక్టర్లు.దాదాపు గంటన్నర పాటు శ్రమించిన డాక్టర్లు..బిగ్ బాస్ షో చూస్తూ క్లిష్టమైన ఆపరేషన్‌కు సహకరించి ప్రాణాలను దక్కించుకున్నాడు గుంటూరు సాఫ్ట్ వేర్ వర ప్రసాద్... ప్రస్తుతం ఈ ఆపరేషన్ వైద్య చరిత్రలో ఒక మిరాకిల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: