కరోనా.... కరోనా.. కరోనా.... గత కొన్ని నెలలుగా ఎటు చూసినా, ఎటు విన్నా ఈ పేరే వినిపిస్తోంది. ప్రపంచ దేశాలను కలవర పెడుతూ, ఈ ప్రజల స్వేచ్ఛ జీవితాన్ని కబళించేస్తూ వీర విహారం చేస్తోంది. అయితే ఈ మహమ్మారి కరోనా వైరస్ జోరుకు బ్రేకులు వేసే రోజులు రాబోతున్నాయి. వ్యాక్సిన్ వస్తే తప్ప ఈ మాయదారి కరోనా అంతమయ్యేలా కనిపించక పోవడంతో వైద్య శాస్త్రజ్ఞులు నిరంకుశంగా కృషిచేసి.. తమ క్లినికల్ ట్రయల్స్ మరింత వేగవంతం చేసి వ్యాక్సిన్ ను తయారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ భారత్ చేరుకోగా.. అటు  జర్మన్ కంపెనీ బయోఎన్టెక్ తో భాగస్వామ్యంలో అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలలోనూ 95 శాతం సత్ఫలితాలను ఇచ్చినట్లు  ఫైజర్ ఇటీవల ప్రకటించింది.

మూడో దశ పరీక్షల మరియు మొదటి ఫలితాల ఆధారంగా తమ వ్యాక్సిన్ సురక్షితమని  ఫైజర్ పేర్కొంది. ఇక యూఎస్, బెల్జియం లలో వినియోగానికి ఈ ఏడాది చివరి కల్లా 5 కోట్ల డోస్ లను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఫైజర్ బయో ఎన్టెక్ తాజాగా పేర్కొన్నాయి. ఎంతో సురక్షితమైన తమ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ యూరోపియన్ యూకే ఔషధ నియంత్రణ సంస్థలకు సైతం తాము దరఖాస్తు చేయనున్నట్లు తెలియజేశారు.

ముందు ముందు ప్రపంచ వ్యాప్తంగా పలు ఇతర దేశాలలో నియంత్రణ సంస్థలకూ దరఖాస్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఫైజర్ తయారీ వ్యాక్సిన్ ను -80-94 సెల్షియస్ లో నిల్వ చేయవలసి ఉన్నందున కంపెనీ ఇందుకు అవసరమైన కూలింగ్ సిస్టమ్స్ ను ఇప్పటికే సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు వీలుగా డ్రై ఐస్ తో కూడిన సూపర్ కూల్ స్టోరేజీ యూనిట్లను కూడా రూపొందించి తమ కృషి ఫలితాన్ని ప్రపంచానికి అందించేందుకు సిద్ధంగా ఉంది....

మరింత సమాచారం తెలుసుకోండి: