ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలను ఏ విధంగా బలహీనం చేయాలి అనే విషయం పైన అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెడతాయి. ప్రత్యర్థి ఎంత బలహీనంగా ఉంటే, అంతగా తాము బలపడ వచ్చు అనే ఆశతో ఆ పార్టీలోని అసంతృప్తి నాయకులను గుర్తించి , వారిని పార్టీలో చేర్చుకుని బలపడాలని అన్ని రాజకీయ పార్టీలు చూస్తూ ఉంటాయి.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వాడివేడిగా జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు ఇక్కడ గెలుపు అత్యవసరం కావడం, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ విజయమే ఆధారం కాబోతుందని, ప్రజల నాడీ ఏంటి అనేది తేలిపోతుంది. అందుకే రాజకీయ పార్టీలు  ఇంతగా  గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టి పని చేస్తున్నాయి. 



రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక నాయకులు అందరిని  గ్రేటర్ లో మోహరించి వారి ద్వారా పట్టు పెంచుకోవాలి అని చూస్తున్నాయి. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు ఆ పార్టీ లపై అసంతృప్తితో ఉంటే, వారిని తమ పార్టీలో చేర్చుకుని తగిన ప్రాధాన్యం ఇస్తామని, వివిధ పదవులు ఇస్తామని వారికి ఆశ చూపించి మరి పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. టిఆర్ఎస్ బిజెపి ఈ వ్యవహారం మరింత చురుగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. టిఆర్ఎస్ కు చెందిన డివిజన్ స్థాయి నాయకులను చేర్చుకుని బిజెపి సవాల్ విసురుతుంది. కాంగ్రెస్ కు  చెందిన వారిని టిఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకునే పనిలో ఉంది. 


ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపిలకు నువ్వా నేనా అన్నట్లు గా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ రేసులో కాంగ్రెస్ పక్కకు తప్పుకున్నట్టుగా వాతావరణం ఉంది. బీజేపీకి జనసేన మద్దతు ఉండడం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ పీఠం సాధించేందుకు ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం తో పాటు, ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తూ వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో బిజెపిలు మంచి ఊపు కనిపిస్తుండగా టిఆర్ఎస్ లో కసి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టి అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: