ఎన్నిక అంటేనే మార్పునకు సంకేతం. ఒకటి కంటే రెండూ మూడూ ఇలా అవకాశాలు ఉన్నపుడు ఎన్నికలు, ఎంపికలూ మారుతూ ఉంటాయి. ఇక గతంతో పోలిస్తే జనాల్లో చైతన్యం కూడా బాగా పెరిగింది. ఎంత మోజు ఉన్నా ఏదో ఒకసారి మొహం మొత్తుతుంది కూడా. ఇక గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీయారెస్ దున్నసింది. అలా ఇలా కాదు. ఏకంగా ఒక్కటి తక్కువ వంద అంటూ అతి పెద్ద మొనగాడుగా నిలిచింది.

అయితే అది 2016 సంవత్సరం. అప్పట్లో టీయారెస్ అధికారంలోకి వచ్చి గట్టిగా రెండేళ్ళు కూడా కాలేదు. పైగా తెలంగాణాను తెచ్చిన ట్యాగ్ కూడా ఉంది. ఇవన్నీ ఇపుడు ఎన్నికల్లో పనిచేస్తాయా అన్నది అతి పెద్ద చర్చ. తెలంగాణాను తెచ్చినందుకు గతంలో లోక్ సభ ఎన్నికల్లో, రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టీయారెస్ కి ఓట్లేసి జనం రుణం తీర్చుకున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ని కూడా చేతిలో పెట్టడమే కాదు, ఈ మధ్య వరకూ స్థానిక ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా ఓటేసి గెలిపించారు.

కానీ ఇపుడే సీన్ నెమ్మదిగా మారుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల ప్రభావం కచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మీద ఉంటుందని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో తాజాగా వచ్చిన వరదలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. అది ఈసారి ఎన్నికల్లో ప్రధానా అంశంగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. మరో వైపు చూస్తే ఈసారి ఓట్ల చీలికకు పెద్దగా అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ మరోసారి చతికిలపడుతోంది. దాంతో టీయారెస్ వర్సెస్ బీజేపీగా గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి.

గతంలో టీడీపీ గట్టిగానే నిలబడింది. కానీ ఒకే ఒక సీటుతో ఓడింది. ఈసారి టీడీపీ అభ్యర్ధులు రంగంలో ఉన్నా కూడా పెద్దగా సౌండ్ లేదు. దాంతో ఓటు వేసే అటా ఇటా అన్నట్లూఅ అటు గులాబీ, ఇటు కాషాయం పార్టీలు ఉన్నాయి. దాంతో గ్రేటర్ జనానికి భలే చాన్స్ వచ్చింది. అందువల్ల ఈసారి కచ్చితంగా గ్రేటర్ ఫలితాలు సంచలనంగా ఉంటాయని అంటున్నారు. టీయరెస్ మేయర్ సీటుని గెలుచుకున్నా కూడా బీజేపీ కూడా మంచి నంబర్ లో సీట్లు సాధిస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: