ప్రస్తుతం నేటి సమాజంలో జుట్టురాలడం అనేది అందరికీ ఒక సర్వసాధారణమైన సమస్య గా మారిపోయింది. కానీ ప్రస్తుతం ఈ సమస్య అందరినీ ఎంతగానో కలిచి వేస్తుంది అనే చెప్పాలి. సాధారణంగా ఒక మనిషికి జుట్టు అందం అన్న విషయం తెలిసిందే. ఆ మనిషి రూపు రేఖలు ఎలా ఉన్నప్పటికీ జుట్టు సరిగా లేకపోతే ఆ మనిషికి అంత అందంగా కనిపించడు. అందుకే జుట్టును కాపాడుకోవడానికి నేటి తరంలో జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఉరుకుల పరుగుల జీవితం నాణ్యమైన భోజనం లేకపోవడం కారణంగా ఎంతోమంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు.



 జుట్టు రాలకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా ఉంటుంది. అంతే కాకుండా ఎంతోమంది ఎంతో ఖరీదైన నూనెలను కూడా జుట్టు రాలకుండా ఉండేందుకు వాడుతూ ఉంటారు. కానీ నూనె రాస్తే జుట్టు రాలుతుందా రాలదా అన్నది మాత్రం ఎవరికీ అంతగా అవగాహన ఉండదు. కొంతమంది నూనె రాసుకోవడం ద్వారా జుట్టు రాలే అవకాశం తక్కువగా ఉండదని... మంచి నాణ్యతతో కూడిన ఖరీదైన నూనె రాయడం ద్వారా జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది అని ఎంతోమంది అభిప్రాయపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇటీవల డెర్మటాలజిస్ట్ లు మాత్రం నూనె రాసుకోవడం పై ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. జుట్టు మొదళ్లకు నూనె బలాన్నిస్తుంది అన్నది పూర్తిగా అవాస్తవం అంటూ ఇటీవలే డెర్మటాలజిస్ట్ లు  చెబుతున్నారు. జుట్టు రాలకుండా ఆపే శక్తి నూనెకీ  ఉండదు అంటూ స్పష్టం చేశారు. నూనె రాసుకుని మసాజ్ చేస్తే కాస్త ఒత్తిడి తగ్గి హాయిగా ఉంటుంది తప్ప జుట్టు రాలడం మాత్రం ఎక్కడా ఆగదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ తినే ఆహారం ద్వారా జుట్టు రాలే సమస్య నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుందని అందుకే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు అని డెర్మటాలజిస్ట్ లు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: