ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి చెంతకు చేరుకుని స్వామివారిని పూజిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.  ప్రతి రోజూ కూడా భక్తుల సందడి ఎక్కువగానే ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద. సీజన్తో సంబంధం లేకుండా ఇసుక వేసిన రాలనంత మంది భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ కారణంగా భక్తుల తాకిడి కాస్త తగ్గినప్పటికీ ఇప్పుడిప్పుడే మళ్లీ ఎక్కువ మొత్తంలో భక్తులు తిరుపతి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.



 తిరుమలకు చేరుకున్న భక్తులు శ్రీవారిని దర్శించుకుని పునీతులవుతు  ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఇటీవలె తిరుమలలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏకంగా తిరుమల చేరుకుని ఒక భక్తుడు చివరికి కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఏకంగా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో బలవన్మరణానికి పాల్పడటం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఏం కష్టం వచ్చిందో ఏమో ఏకంగా శ్రీవారి సమక్షంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సదరు భక్తుడు.



 తిరుమల వకుళమాత అతిథిగృహంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఏకంగా  అతిథి గృహంలోనే ఉరివేసుకొని చనిపోవడం అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. మృతుడు హైదరాబాద్ మల్కాజిగిరి కి చెందిన శ్రీధర్ గా గుర్తించారు పోలీసులు. ఇక వెంటనే సదరు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా శ్రీధర్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ట్లు పోలీసులు గుర్తించారు. శ్రీధర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అనే విషయంపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: