టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది అని ప్రచారం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది.  ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా అది ఆయన ఢిల్లీ పర్యటనకు సంబంధించి మాత్రం రాజకీయ వర్గాలు ఆసక్తి కరంగా చూస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది. ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు.

 కాని దీనికి సంబంధించి మాత్రం ఇప్పుడు కొన్ని ప్రచారాలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చంద్రబాబు నాయుడు కాస్త దూకుడుగా ఉన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది జరిగితే బాగుంటుంది అనే భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశాన్ని ఆయన అఖిలపక్ష నేతలతో కూడా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ అఖిల పక్ష సమావేశానికి కూడా పిలిచే అవకాశాలు ఉండవచ్చు.

బిజెపి జనసేన పక్షాలు ఇంకా ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ ఈ అఖిలపక్ష సమావేశానికి పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు అదే విధంగా రాష్ట్రంలో పోలవరం అంశం రాజధాని అంశం గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. వామపక్షాల నేతలతో కలిసి కూడా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది చూడాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ పరిస్థితులు లేని సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: