కరోనా  వైరస్ కేసులు వెలుగులోకి వచ్చి  ఆ తర్వాత లాక్ డౌన్  విధించిన తర్వాత అన్ని రకాల సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోడ్డు రవాణా సర్వీసులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు రవాణా సర్వీసులు అందుబాటులో లేక తీవ్ర స్థాయిలో ప్రజలు అందరూ ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం సొంత వాహనాలు ఉంటేనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఇక ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలలో భాగంగా... అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభించుకునేందుకు  కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసును ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం కూడా అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసును ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభం కావడానికి ఆలస్యం అయినప్పటికీ ఎట్టకేలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు రవాణా కష్టాలు పూర్తిగా తగ్గిపోయాయి.  ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.


 తమిళనాడుకు  కూడా బస్సు లు  ప్రారంభించాలని ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది ఈనెల 25వ తేదీ నుంచి తమిళనాడుకు కూడా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ. ఈనెల 25వ తేదీ నుంచే తమిళనాడులోని చెన్నై కి బస్సులు ప్రారంభించనున్న ఏపీఎస్ఆర్టీసీ... ఆంధ్రప్రదేశ్లోని పలు డిపోల నుంచి ఈ బస్సు సర్వీసులను తమిళనాడుకు తిప్పనుంది. ముందుగా తక్కువ సంఖ్యలో మాత్రమే బస్సు సర్వీసులు ప్రారంభించనున్న  ఏపీఎస్ఆర్టీసీ ఆతర్వాత పరిస్థితులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచేందుకు నిర్ణయించింది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: