ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడూ ఉంటుంది ఏంటీ అనే దానిపై ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం దూకుడుగా ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఆధారంగా చూస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘం వెనక్కు తగ్గే అవకాశాలే ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలియకపోయినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఎన్నికల నిర్వహణ అనేది ఏమాత్రం కూడా సాధ్యం అయ్యేపని కాదు.

అవకతవకలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. దీనితో కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అధికారుల నుంచి సహకారం కూడా లేకపోవచ్చు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో వెనక్కుతగ్గితే మంచిది అనే భావనలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారని అంటున్నారు. ఎన్నికల నిర్వహణ జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా సాధ్యం కాదని కాబట్టి వెనక్కి తగ్గటం మంచిది అనే భావనను ఆయన కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలు కూడా ఇప్పటికే చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది.

ఇదే విషయాన్ని ఆయన త్వరలోనే బయటపెట్టే అవకాశాలు ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం మీద కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉంది అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తమను ఇబ్బంది పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది అనే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లాలి అని భావిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: