ప్రస్తుతం దేశాన్ని మొత్తం కరోనా  వైరస్ పట్టిపీడిస్తోంది అన్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ కరోనా వైరస్ మాత్రం ఎక్కడా కంట్రోల్ కావడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ అక్కడక్కడ పలు రాష్ట్రాల్లో మాత్రం కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో దేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కూడా శుభ పరిణామం గా మారిపోయింది. అయితే గతంలో కరోనా వైరస్ పేరెత్తితే చాలు భయపడిపోయి ఇంటి నుంచి కాలు బయట పెట్టని  జనాలు ప్రస్తుతం కరోనా వైరస్ అంటే ఒక సాధారణ ఫ్లూ  లా గా భావిస్తూ ఇక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ రోజువారి కార్యకలాపాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కరోనా వైరస్ బారినపడి ప్రాణాలమీదికి కూడా తెచ్చుకున్నారు.కాగా  తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య తక్కువగానే నమోదవుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టడంలో విజయవంతం అయిందని అధికార పార్టీ నేతలు చెబుతూనే ఉన్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ ప్రభావం పై  పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అందరికీ హెచ్చరికలు జారీ చేశారు.



 తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ముప్పు తొలగి పోలేదని అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు ఆయన. కరోనా నిబంధనలు పాటించి  జాగ్రత్తగా ఉండడం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు అంటూ సూచించారు. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించిన నేతలు కార్యకర్తలు అందరూ మాస్కులు ధరించడం తో పాటు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: