గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా లేదు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు అని ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. అయితే జనసేన పార్టీ నేతలు మాత్రం తాము భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ప్రచారానికి ఆహ్వానించే ఆలోచన భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారని అంటున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే చోట్ల... ఈ ప్రచారానికి పిలిచే ఆలోచనలో ఉన్నారట.

అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ద్వారా ప్రచారం చేసుకుంటే బాగుంటుంది అనే భావన బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కొన్ని ప్రాంతాల్లో జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ఇప్పుడు జనసేన పార్టీ ని ఏవిధంగా వాడుకోవాలి ఏంటి అనేది భారతీయ జనతా పార్టీ కి అర్థం కావడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రచారానికి దాదాపుగా రెడీగా లేరు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

ఇప్పుడు ఆయన ప్రచారం చేస్తే తెలంగాణ ప్రభుత్వంతో ఆయన గొడవకు వెళ్ళినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఆయనను చులకనచేసి టీఆర్ఎస్ నేతలు మాట్లాడే అవకాశం కూడా ఉండవచ్చు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈ రెండు స్థానాలు గురించి పదే పదే చెప్పి పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లో చులకన చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. అందుకే హైదరాబాదులో పవన్ కళ్యాణ్ ని కూడా ప్రచారానికి దూరంగా ఉండాలి అని భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: