కరోనా  వైరస్ ప్రభావం విద్యారంగంపై ఎక్కువగా పడిన విషయం తెలిసిందే. వైరస్ వెలుగులోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  విధించినప్పుడు  మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో తెరుచుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే.  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలను ప్రారంభించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కరొన  వైరస్ ప్రభావం దృశ్య విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్త వెనుకడుగు వేయక తప్పలేదు. అయితే పలు మార్లు పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... కరోనా  వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేస్తూ వచ్చింది. కానీ నవంబర్ 2 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు  ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.



 మొదట 9, 10 తరగతుల విద్యార్థులకు విద్యా బోధన నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. రోజు విడిచి రోజు విద్యాబోధన చేయడంతోపాటు కేవలం ఒంటి పూట మాత్రమే విద్యాబోధన చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే విద్యాసంవత్సరం ఆలస్యమైన కారణంగా ఇంకా ఆలస్యమైతే విద్యార్థులకు ఒక విద్యా సంవత్సరం వృధా అయ్యే అవకాశం ఉంది అని భావించిన ప్రభుత్వం.. చివరికి విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు నిర్ణయించింది.



 అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 9, 10 తరగతులు విద్యార్థులకు మంచి విద్యాబోధన చేస్తున్నప్పటికీ విద్యార్థుల హాజరు మాత్రం తక్కువగా నమోదు అవుతుంది. దీనికి గల కారణం ఏమిటి అని ఇటీవలే ఏపీ విద్యాశాఖ సర్వే నిర్వహించగా  ఆసక్తికర నిజం బయటపడింది. కరోనా వైరస్ భయంతోనే 80 శాతం మంది విద్యార్థులను  వారి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించేందుకు అంగీకరించడం లేదు అని ఇటీవలే విద్యా శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా జిల్లాపరిషత్ పాఠశాలలు  కొన్ని గ్రామాలకు దూరంగా ఉండటంతో సరైన రవాణా సౌకర్యం లేక... పిల్లలను స్కూల్కు పంపిం చాలని ఉన్నప్పటికీ కూడా కొంతమంది పంపించడం లేదు అన్నది కూడా బయటపడింది. దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: