ఎన్నికలంటేనే చిత్రవిచిత్రాలు ఎన్నో చోటుచేసుకుంటాయి. ఒక్కసారిగా ఒక్కొక్కరికి అమాంతం ప్రాధాన్యం పెరిగి పోతూ ఉంటుంది. సొంత పార్టీలో అసలు ఏమాత్రం గుర్తింపు లేకుండా, పార్టీలో ఉన్నా, లేనట్టుగా ఉండే కొంతమంది నాయకులకు అమాంతం ప్రాధాన్యం పెరిగిపోతూ ఉంటుంది. ఎన్నికలు అంటేనే ఈ తరహా ప్రాధాన్యాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిని బుజ్జగిస్తూ వారి కోరికలను తీరుస్తూ ఎక్కడాలేని ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాయి. ఇదే సమయంలో ఈ విషయం పైన పూర్తిగా దృష్టి పెడతాయి. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న నాయకులు రాజకీయ ప్రాధాన్యం లేకుండా, పార్టీ అధిష్టానం  తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నవారు ఎవరా అని ఆరా తీసే పనిలో ప్రత్యర్థి పార్టీలు నిమగ్నమై , వారిని తమ దారిలోకి తెచ్చుకుని, పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి, వారిని చేర్చుకుని ప్రత్యర్థి పార్టీల కు గట్టి షాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి.



 ప్రస్తుతం గ్రేటర్ వార్ వాడివేడిగా జరుగుతోంది. బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీలు పూర్తిగా చేరికలపై దృష్టి సారించాయి. కాంగ్రెస్ బలహీనం కావడంతో ఆ పార్టీలో ఉన్న బలమైన నాయకులను , సామాజిక వర్గాల అండదండలు పుష్కలంగా ఉన్న వారిని గుర్తించి తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉన్న సర్వే సత్యనారాయణ సస్పెన్షన్ కు గురై సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు  దీంతో ఆయనను చేర్చుకునేందుకు బిజెపి నాయకులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లడం, పార్టీలో చేరమని ఆహ్వానించడం వంటి కారణాలతో తన ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగినందుకు ఆయన మహా ఆనందం గా కనిపిస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల సంఘం నేతగా మంచి గుర్తింపు పొంది , ఆ తర్వాత కెసిఆర్ దృష్టిలో పడి ఎమ్మెల్సీగా, శాసనమండలి చైర్మన్ అయిన స్వామి గౌడ్ ఆ తర్వాత కేసీఆర్ పట్టించుకోకపోవడంతో అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు. 



ఆయనను బీజేపీ లో చేర్చుకునేందుకు ఆ పార్టీ కీలక నాయకులు స్వామి గౌడ్ ఇంటికి వెళ్లి చర్చించడం, ఆయన పార్టీలో చేరేందుకు ఒప్పుకోవడం వంటివి జరిగాయి. ఈ విధంగా నాయకులు అందర్నీ గుర్తించి తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఎస్ సైతం ఇదే ఫార్ములాను ఉపయోగించి తమ పార్టీలోకి చేరికలు ప్రోత్సహిస్తోంది.ఈ విధంగా పార్టీల మధ్యే పోటీ నెలకొనడంతో, రాజకీయ ప్రాధాన్యం లేకుండా ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న నాయకులందరికీ ఒక్కసారిగా ప్రాధాన్యం పెరిగినట్టు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: