గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉందని రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా రాజకీయ వర్గాలు మాత్రం దీనికి సంబంధించి ఆసక్తికర చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే టిఆర్ఎస్ పార్టీ పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.

అందుకే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సత్తా చాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నా సరే కొన్ని కొన్ని స్థానాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ గట్టిపోటీని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు ప్రచారం చేస్తే బాగుంటుంది అనే భావన కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాదులో ప్రచారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన పాతబస్తీ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి ఇప్పటికే షెడ్యూల్ని కూడా బీజేపీ నేతలు రెడీ చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన కూడా చేయనున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఆయన ప్రచారం చేస్తే మాత్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటీ అనే దానిపై ఇప్పుడు చాలా వరకు ఆసక్తి పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: