తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా గ్రేటర్  ఎన్నికల తర్వాత తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు క్యాబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారు ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా రావడం లేదు. అయితే ఇప్పుడు క్యాబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావుని తీసుకుంటారా లేదా అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు కేబినెట్ లోకి రావడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన ఏ పదవి లేకుండా ఖాళీగానే ఉన్న సంగతి తెలిసిందే. ఈ దీంతో ఆయన బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయనను కట్టడి చేయడానికి గాను టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనను కట్టడి చేసే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఆయన మంత్రి పదవి కూడా అడుగుతున్నట్లు సమాచారం.

ఆయనకు ఖమ్మం జిల్లాలో చాలా మంచి క్యాడర్ ఉన్న సంగతి తెలిసిందే. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే విజయం సాధించగలిగే నేత. కాబట్టి ఇప్పుడు ఆయన విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్టు గా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి దీనికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. అయితే ఇటీవల ఆయనను టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కాస్త గుర్తించి రైతు వేదికల ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: