ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం అనేది ఇప్పుడు చాలా కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సీఎం జగన్ చాలావరకు జాగ్రత్తగానే ఉన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను వద్దు అంటున్నా సరే ఇప్పుడు నిర్వహించాలి అని భావించడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొన్ని చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రభావం చూపించే విధంగా సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువగాప్రభావం చూపించే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గా తెలుస్తుంది. అక్కడ నాయకులతో సీఎం జగన్ త్వరలోనే కొన్ని సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఈ రెండు జిల్లాలు విశాఖ కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల మద్దతు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ రెండు జిల్లాల్లో విజయం సాధించడానికి సీఎం జగన్ ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగానే ఉన్నారు. త్వరలోనే నాయకులకు కొన్ని బాధ్యతలను కూడా ఆయన అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లేకపోయినా సరే ఎప్పుడు నిర్వహించిన సరే సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు వెళ్లాలని సంక్షేమ కార్యక్రమాలను చాలా వరకు జాగ్రత్తగా ప్రజల్లో అందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని నాయకులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే భావనను సీఎం జగన్ వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: