ఇయర్ ఫోన్స్ ఒక యువకుడి పాలిట శాపంగా మారాయి .. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ రైల్ పట్టాలను  ని దాటుతుండగా ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన  వరంగల్ అర్బన్ జిల్లా లో చోటు చేసుకుంది .. వివరాలలోకి వెళ్తే

వరంగల్ అర్బన్ జిల్ల్లాలోని చింతల్ లో అల్లూరి సునీల్ అనే యువకుడు నివసించేవాడు .. అతను పెయింటర్ . తన రోజు వారి పెయింటింగ్ పనులు కోసం దగ్గర్లోని షాప్ కి వెళ్ళాడు .. తన పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాడు .. పాటలు వింటూనే రైలు పట్టాలను దాటుతుండగా అటుగా వస్తున్నా రైలు ఢీకొట్టడంతో అల్లూరి సునీల్ అనే యువకుడు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు ..

దగ్గర్లోని మొబైల్ ఫోన్ ద్వారా అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన రైల్వే పోలీసులు .మృతదేహాన్ని  ఎంజీఎం హాస్పిటల్ మార్చురీకి తరలించారు ..ఈ ఘటన పై  వరంగల్ రైల్వే అధికారులు ఇచ్చిన పిర్యాదు  మేరకు కేసు నమోదు చేసుకున్నారు ..

మాములుగా ట్రైన్ వస్తున్నా శబ్దం అది  దగ్గరగా  వచ్చేవరకు మనకి  తెలీదు ... అలాంటిది సునీల్ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టడం తో రైలు వచ్చే శబ్దాన్ని సునీల్ కనిపెట్టలేకపోయాడని  స్పష్టంగా అర్థం అవుతుంది .. ఇంకా వీళ్లు దాటే చోటే రైల్వే గేట్ కూడా  లేనట్లు కనబడుతుంది .. సునీల్ లాంటి కొందరు రైలు వస్తున్నా  పట్టాలను దాటే ప్రయత్నం  చేస్తున్నారు ..ఆలా చేయడం చాలా ప్రమాదకరం .. మరి ముఖ్యంగా సునీల్ చేసిన మాదిరి రైలు పట్టాలు దాటేటపుడు ఇయర్ ఫోన్స్ అస్సలు పెట్టుకోకండి .. సెల్ ఫోన్ ని చూడకండి ..రైలు వస్తుందా  అని చూసి జాగ్రత్తగా పట్టాలను  దాటండి ..   ప్రాణాలను కాపాడుకోండి .. 

మరింత సమాచారం తెలుసుకోండి: