దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తీవ్రత ఏ మాత్రం కూడా ఆగటంలేదు. రోజు రోజుకి కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. దీనితో ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి అసలు పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు. కరోనా వైరస్ కట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అక్కడ మాత్రం సాధారణ పరిస్థితులు రావడం లేదు. దీంతో ఇప్పుడు విదేశాల సహకారం కూడా తీసుకునే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అనే ప్రచారం జరుగుతోంది.

ఇతర దేశాల సహకారం తీసుకుని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ప్రతి ఇంటికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ లో ప్రతి ఇంటికి కూడా పరీక్షలు చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కచ్చితంగా ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ లో ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతోంది.

హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ సహా ఇతర అధికారులతో కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఢిల్లీలో గనక కరోనా కేసులు తీవ్రత కట్టడి కాకపోతే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల మీద,  ఆర్థిక వ్యవస్థ మీద బలంగా పడే అవకాశాలు ఉంటాయి. ఇక ఢిల్లీ సరిహద్దులను కూడా మూసి వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రధానంగా హర్యానా అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సరిహద్దులను మూసేసి ఆలోచనలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: