మహిళలను లైంగికంగా హింసించడం మాత్రమే కాదు.. బెదిరించి కూడా చాలా మంది డబ్బులను గుంజుతున్నారు.. ఎటూ చూసిన మహిళలు ఏదోక విధంగా మగాళ్ళ చేతిలో మోసపోతున్నారు. చట్టాలు మారిన సెక్షన్లు మారిన కూడా వారి పై జరుగుతున్న అనేక దాడులు మాత్రం మారలేదు.. ఏదోక రకంగా దాడులను ఎదుర్కొంటున్నారు.ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం అందరినీ షాక్ కు గురిచేస్తుంది.. ఆర్మీ ఆఫీసర్ ను అంటూ ఓ వ్యక్తి మహిళల దగ్గర నుంచి డబ్బులను గుంజాడు. ఒకరు ఇద్దరి దగ్గర కాదు.. చాలా మంది దగ్గర డబ్బులను రాబట్టాడు.అతని ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు..



వివరాల్లోకి వెళితే..ఆర్మీ ఆఫీసర్ నంటూ మహిళలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఆర్మీ ఆఫీసర్‌గా రిజిస్టరై పెళ్లి పేరుతో యువతులను ట్రాప్ చేసేవాడు. ఖరీదైర కార్లలో తిరుగుతూ వారిని నమ్మించి భారీగా డబ్బులు కాజేశాడు..చాలా మంది అతని మోజులో పడి డబ్బులను సమర్పించుకున్నారు. చివరికి మోసపోయామని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన భాగ్యనగరం హైదరాబాద్ లో చోటు చేసుకుంది.



ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ నేరేడ్‌మెట్‌లో స్థిరపడ్డాడు. తాను ఆర్మీ ఆఫీసర్‌నని.. మేజర్ ర్యాంకులో ఉన్నట్లు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లలో ప్రకటనలిచ్చి మహిళలను ట్రాప్ చేసేవాడు. ఆర్మీ యూనిఫాంలో ఖరీదైన కార్లలో తిరుగుతూ ఆర్మీ అధికారిగా నమ్మించేవాడు. ఇప్పటి వరకు 17 మంది మహిళలను ట్రాప్ చేసి వారి దగ్గర నుంచి దాదాపు 7 కోట్ల వరకు డబ్బులను గుంజాడు..శ్రీను నాయక్ చేతిలో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేటుగాడి ఆటలను పోలీసులు కట్టడి చేశారు.నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు డమ్మీ పిస్టల్స్, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మిలటరీ కి సంబంధిన నకిలీ ఐడి లను ఇతరత్రా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని మహిళలకు పోలీసులు హెచ్చరించారు.. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: