టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అభద్రతతోనే పోలవరం సందర్శనకు అడ్డంకులు అని ఆయన మండిపడ్డారు. జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం అని ఆయన పేర్కొన్నారు. ప్రజల తిరుగుబాటుతో జగన్ పతనం మొదలైంది అని ఆయన వ్యాఖ్యానించారు. సీపీఐ, సీపీఎం నేతలను హౌస్ అరెస్టు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం అని ఆయన అన్నారు. పోలవరం సందర్శన పిలుపుతో జగన్ ప్రభుత్వ పునాదుల్లో వణుకు మొదలయింది అన్నారు.

చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు పోలవరాన్ని జగన్ రెడ్డి సుడిగుండంలో నెట్టేశారు అని ఆయన మండిపడ్డారు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే హౌస్ అరెస్టులు చేస్తున్నారని... పోలవరాన్ని ఉద్దరించామంటూ.. ఈ అరెస్టులు ఎందుకు  అని ఆయన ప్రశ్నించారు. గతంలో 70 పనులు చేశాం అని ఆయన అన్నారు. చూపిస్తే విమర్శించారు అని మండిపడ్డారు. మీరు చేసిన పనుల్ని చూద్దామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఆయన నిలదీశారు. ఎందుకంత అభద్రత.? ఎందకంత భయం.? అని ఆయన ప్రశ్నించారు.

పోలవరం ఎత్తు తగ్గించి, నీటి నిల్వ సామర్ధ్యం తగ్గించారు అని మండిపడ్డారు. ప్రాజెక్టు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందుకే ప్రజల పర్యటన చూసి భయం అని ఆయన విమర్శించారు. పోలవరం ప్రజల ఆస్తి. దాన్ని పరిశీలించేందుకు వెళ్లేవారిని అడ్డుకునే హక్కు మీకెక్కడిది.? అని ఆయన నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భాధ్యతారాహిత్యం తగదు అని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సాగునీటిరంగ ముఖచిత్రాన్న మార్చే పోలవరాన్ని విచ్ఛిన్న చేస్తున్నారు అని విమర్శలు చేసారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు అని, రెండేళ్ల పాలనలో 2% పనులు కూడా చేయలేదు అన్నారు. 70% పనులు పూర్తి చేసిన టీడీపీపై విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారు అని విమర్శలు చేసారు. మొన్న టిడ్కో గృహాలు, అంతకు ముందు అమరావతి, ఇప్పుడు పోలవరం ప్రజలు పరిశీలిస్తే మీరెందుకు వణుకుతున్నారు.? అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: