ఎంఎంటిఎస్ 2 వపేజ్ కు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కొంత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకుంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం నిధులు ఇవ్వలేక 2 వ పేజ్ ఆగిపోయింది అని ఆయన విమర్శలు చేసారు. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అన్నారు. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ నీళ్లను ను కొబ్బరి నీళ్లు చేస్తామన్నారు అని, హుస్సేన్ సాగర్ దగ్గర ట్విన్ టవర్స్ నిర్మిస్తామన్నారని ఆయన విమర్శలు చేసారు. మూసి ప్రక్షాళన ఎందుకు జరగలేదు అని ఆయన ప్రశ్నించారు. మూసి కబ్జాకు గురవుతుందన్నారు.

జిహెచ్ఎంసి రెవెన్యూ ఉండే ప్రాంతం అని ఆయన  పేర్కొన్నారు. మాటలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచారు... చేతలతో బ్రాండ్ ఇమేజ్ ను మూసిలో ముంచారు అని ఆయన ఎద్దేవా చేసారు. హైదరాబాద్ లో బీజేపీ కి పట్టం కడితే మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తాం అన్నారు. హోర్డింగ్ ల విషయంలో మొత్తం అధికార పార్టీ వేసుకున్నారు .. ఇతర పార్టీలకు ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. అధికారులు మాకు ఇవ్వడానికి లేదంటున్నారు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇది ఏమైనా నిజాం రాష్ట్రమా...? ఏమైనా ప్రయివేటు లిమిటెడ్ కంపనీ..? అని ప్రశ్నించారు.

పాత పట్నం ఒవైసీ.. కొత్త పట్నం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బలైంది అని మండిపడ్డారు. భూకబ్జా ల తెలంగాణ ,వర్షానికి ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ మేము చూస్తామనుకోలేదు అని, ప్రజలకు విజ్ఞప్తి బీజేపీని ఆదరించండి...స్వచ్ఛ భారత్ నగరంగా తీర్చిదిద్దుతాం అని ఆయన పేర్కొన్నారు. పార్కులు, మార్కేట్ యార్డులు,స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు నిర్మాణం చేపడుతాం అని స్పష్టం చేసారు. హైదరాబాద్ కి 2 మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఇక్కడే ఉన్న ప్రోటోకాల్ అని కూడా నాకు చెప్పకుండా ఇనాగురేట్ చేస్తారు అని ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: