ఏపీలో న్యాయ వ్యవస్థ విషయంలో ఇప్పుడు రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ నేతలు కొందరు ఈ అంశం గురించి పదే పదే రాష్ట్ర ప్రభుత్వంప విమర్శలు చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక రాజకీయంగా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ కి సిఎం జగన్ రాసిన లేఖ ఎంతో సంచలనం అయింది. ఈ లేఖపై ఇప్పుడు దుమారం ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు చేసారు.

న్యాయ వ్యవస్థపైనే నిందితుల దాడి ఆందోళనకరం అని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు సిజెకు జగన్ రెడ్డి లేఖను సీరియస్ గా తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. న్యాయమూర్తులంతా ఏకతాటిపై నిలిచి దీనిని ఖండించాలన్నారు. ఏకతాటిపై లేకపోతే, నిందితులంతా ఇవే పోకడల్లో పోతారు అని ఆయన విమర్శలు చేసారు. ప్రతి నిందితుడూ ఇకపై న్యాయవ్యవస్థను బెదిరిస్తారు అని ఆయన ఆరోపించారు. తొలి నుంచి న్యాయమూర్తులను టార్గెట్ చేస్తున్న జగన్ రెడ్డి అంటూ విమర్శించారు.

జగన్ రెడ్డి అనుచరులు కూడా అదే పెడ పోకడల్లో పోతున్నారు అన్నారు. కోర్టుల ముందు ట్రయల్స్ లో జగన్ రెడ్డిపై 31 కేసులు ఉన్నాయని అన్నారు. ట్రయల్స్ నేపథ్యంలోనే జగన్ రెడ్డి లేఖ రాశారు అని ఆయన మండిపడ్డారు. నిందితులే న్యాయవ్యవస్థను బెదిరించడం నిత్యకృత్యం కారాదు అన్నారు.  ప్రశాంత్ భూషణ్ పై స్పందించినట్లే, జగన్ రెడ్డి లేఖను సీరియస్ గా తీసుకోవాలి అని,  ఇదే పెడ పోకడ ప్రతిఒక్కరూ పోతే, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తికే ప్రమాదం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువలు మంటగలుస్తాయని విమర్శించారు. నిందితులే అత్యున్నత న్యాయమూర్తులను బెదిరిస్తే, ఇక దిగువ కోర్టులు ఎలా పనిచేస్తాయి..? వెలుపలి బెదిరింపుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుదే అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: