గ్రేటర్ ఎన్నికలు కత్తి మీద సాముగానే అన్ని పార్టీలకు ఉన్నాయనడంతో సందేహం లేదు. అధికార టీయారెస్ కి అయితే ఓ వైపు వణుకు మొదలైందనే  అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తరువాత జనంలో టీయారెస్ పట్ల  యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అర్ధమైంది. దాన్ని నిలువరించి గెలుపు తీరాలకు చేరడం అంటే ఇప్పుడున్న స్థితిలో ఇబ్బందికర‌మే అని అంటున్నారు మరో వైపు ప్రజా వ్యతిరేకత ఉందన్నది రుజువు కావడంతో దాన్ని మరింత పెద్దది చేసి లబ్ది పొందేందుకు విపక్షాలు గట్టిగానే కృషి చేస్తున్నాయి.

ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం ఓటర్లు 80 లక్షలకు పై చిలుకు ఉన్నారని అంటున్నారు. ఇందులో నుంచి చూస్తే 30 లక్షల దాకా సెటిలర్స్ ఉన్నారుట. గత సారి ఈ ఓట్లలో తొంబై శాతం దాకా టీయారెస్ కి పడ్డాయి. అపుడు టీయారెస్ బలమైన పార్టీ,  ఆ మోజు వేరు, కేసీయార్ కి ఎదురెళ్ళే సాహసం కూడా అనాడు ఎవరూ చేయలేని పరిస్థితి. దానికి సెటిలర్లకు పెద్ద ఎత్తున హామీలు కూడా టీయారెస్ నాడు ఇచ్చింది. దాంతో గుత్తమొత్తంగా ఓట్లేశారు. ఆ దెబ్బకు టీడీపీకి ఒకే ఒక్క సీటు వస్తే 99 సీట్లతో టీయారెస్ జబ్బలు చరచింది.

ఇక ఇపుడు చూస్తే సీన్ వేరేగా ఉంది. టీయారెస్ కి జనంలో అదరణ తగ్గిందన్న సమాచారం ఉంది. పైగా ఆల్టర్నేషన్  గా బీజేపీ  ఉంది. దాంతో సెటిలర్స్ ఈసారి ఏకమొత్తంగా టీయారెస్ కి ఓటేసే సీన్ కనిపించడంలేదు. దానికి తోడు సెటిలర్స్ కి టీయారెస్ సీట్ల కేటాయింపులో అన్యాయం చేసిందన్న బాధ కూడా ఉందిట. ఈ పరిణామాలు అన్నీ కలసి గ్రేటర్ లో ఫలితాలన్ని ఎలా సెటిల్ చేస్తాయన్న టెన్షన్ టీయరెస్ లో పట్టుకుంది.

ఈసారి సెటిలర్స్ తమ ఓట్లను బీజేపీకి, టీడీపీకి కూడా వేయాలనుకుంటున్నారుట. దాంతో గతంలో కేవలం రెండు మూడు సీట్లు ఉన్న బీజేపీ ఈసారి గణనీయమైన ఫలితాలే సాధిస్తుంది అంటున్నారు. అదే విధంగా టీడీపీకి కూడా బాగానే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: