ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. తాను చెప్పినట్లుగా ప్రతీ హామీని నెరవేరుస్తున్నారు. ఇంతవరకూ సంక్షేమం మీదనే దృష్టి సారించిన జగన్ ఇపుడు అభివృద్ధి మీద కూడా శ్రద్ధ  పెడుతున్నారు. ఇక జగన్ హామీల్లోకెల్లా అతి ముఖ్యమైనది, భారీ అయినది ఒకటి ఉంది. అదే ముప్పయి లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ. ఇది కనుక జరిగితే జగన్ దాదాపుగా విజయం సాధించిన‌ట్లే. ఇంతకాలం పెండింగులో పడిన ఈ హామీని ఇపుడు జగన్ బయటకు తీశారు. నేరవేర్చేందుకు రెడీ అయ్యారు.

దాని కోసం ఆయన క్రిస్మస్ ముహూర్తంగా పెట్టుకున్నారు. డిసెంబర్ 25న ఇళ్ళ పట్టాల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. అదే రోజున బీజేపీ అగ్ర నేత. మాజీ ప్రధాని వాజ్ పేయి పుట్టిన రోజు కూడా. దాంతో బీజేపీ నుంచి కూడా ఖుషీ చేసేలా ఆ రోజుని జగన్ ఎంచుకున్నారని అంటున్నారు. పెద్ద ఎత్తున పట్టాలను పంపిణీ చేసిన  తరువాత తొలిదశలో 15 లక్షల ఇళ్ళ నిర్మాణం పనులను కూడా జగన్ చేపడతారు అంటున్నారు.

దాంతో రానున్న రోజుల్లో ఇళ్ళు లేని వారు దాదాపుగా ఏపీలో ఉండరు,  ఉండకూడదు అన్నది జగన్ ఆలోచన. అదే విధంగా ఇళ్ళ పట్టాలు, ఇళ్ళూ పొందిన వారు కచ్చితంగా వైసీపీ పక్షం ఉంటారని, రాజకీయంగా అది లాభిస్తుందని జగన్ ఆలోచన చేస్తున్నారుట. ఇక వచ్చే ఏడాది ఉగాదికి జగన్ మరో పెద్ద కార్యక్రమం ప్రకటిస్తారు అంటుననరు. అదే కొత్త జిల్లాల ప్రకటన అంటున్నారు.

ఇది కూడా ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీవే. తాను అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్ సీటుని ఒక జిల్లాగా చేస్తాను అని జగన్ హామీ ఇచ్చారు. ఆ ప్రకారం పాతిక జిల్లాలు కావాలి. అయితే వివిధ రాజకీయ వత్తిళ్ళు, సమీకరణల కారణంగా 32 జిల్లాలుగా ఏపీలో మారుతాయని అంటున్నారు. మొత్తానికి పండుగ నుంచి పండుగ వరకూ జగన్ హామీల అమలుతో జనాలకు ప్రతీ రోజూ  పండుగే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: