గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయావకాశాలు కూడా పార్టీ చేసుకునే ప్రచారం మీదనే దాదాపు ఆధారపడి ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే ప్రచారం గట్టిగా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తెలంగాణ సర్కారును ఇబ్బందిపెట్టే విధంగా బీజేపీ విమర్శలు చేసుకోవాల్సిన అవసరం అనేది ఆ పార్టీ ముందు ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ విమర్శలు చేసే విషయంలో ఆశించిన స్థాయిలో విమర్శలు చేయలేకపోతుంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి.

ప్రధానంగా పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ని ఎదుర్కొనే విషయంలో ఇప్పుడు బిజెపి దాదాపుగా వెనుకబడింది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. రాజకీయంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ బలపడాలంటే కొన్ని విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అనేది ఉంది. కానీ బిజెపి నేతలు మాత్రం చాలావరకు విమర్శలు చేసే విషయంలో కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నారు అనే విషయాన్ని చెప్పడం మినహా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనే భావన ప్రజల్లో బలంగా కలిగించ లేకపోతున్నారు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

దీనితో ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ వెళ్ళలేక పోతుంది అనే భావన చాలా మందిలో ఉంది. మజ్లీస్ పార్టీతో తమ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి అందుకే బీహార్ ఎన్నికల్లో ఆ పార్టీ బిజెపికి మేలు చేసింది అనే భావన చాలా మందిలో ఉంది. కాబట్టి ఆ ఆరోపణలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఆరోపణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి సమాధానం ఇవ్వకుండా బిజెపి నేతలు దాటేస్తున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. మరి ఈ ఆరోపణలను ఏ విధంగా బీజేపీ నేతలు ఎదుర్కొంటారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: