గ్రేటర్ హైదరాబాద్ లో బిజెపిని ఎదుర్కోవాలి అంటే తెరాస లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రచారం చేసుకునే విషయంలో బీజేపీ ని అన్ని విధాలుగా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలు మాత్రం ప్రచారం చేసే విషయంలో ఘోరంగా వెనుక పడుతున్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. దీనితో పార్టీ ఎక్కువగా నష్టపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలు టిఆర్ఎస్ పార్టీలో కాస్త హుషారునిస్తున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ముందుకు వస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన దాదాపుగా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం  హరీష్ రావు పార్టీకి తన అవసరం వచ్చిన సమయంలో ముందుకు రావాలని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హరీష్రావు కి మంచి అభిమానులే ఉన్నారు.

కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తే బాగుంటుంది అనే భావన హరీష్ రావు వద్ద కొంతమంది వ్యక్తం చేశారని సమాచారం. దీంతో త్వరలోనే హరీష్ రావు ప్రచారం లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపుగా ఆయన రెండు మూడు రోజులపాటు ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 40 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇక ఆయనతో పాటు కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు బిజెపిని ఎదుర్కొని నిలబడాలి. కాబట్టి ప్రచారం చేసే విషయంలో బలంగా మాట్లాడగలిగే నేతలు ఉంటేనే బాగుంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: