ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సీఎం వైయస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద ఆగ్రహంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న సరే ఇప్పుడు ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అవుతుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయినా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

రాష్ట్రంలో తనను ఇబ్బంది పెట్టడానికి కొన్ని శక్తులు ఎన్నికల సంఘాన్ని వాడుకుంటున్నాయి అని ఆయన ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావించారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఆసక్తి చూపిస్తున్నారని కూడా అంటున్నారు. అయితే ఫిబ్రవరి లో వద్దని... మార్చి లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

అప్పటికి చలి కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కరోనా కేసులు తీవ్రత కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను అప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది అని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికి  సంబంధించి త్వరలోనే ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అభిప్రాయపడుతున్నారు. మరి ఎన్నికల విషయంలో జగన్ ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఏపీలో కరోనా కేసులు తీవ్రత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్నికల నిర్వహణ వద్దని కొంతకాలం ఆగిన తర్వాత నిర్వహిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: