గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బిజెపి నేతలు దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తూ గ్రేటర్ ఎన్నికల్లో తమ ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా నేతలు అందరూ కూడా హైదరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎంపీ బాపూరావు కీలక వ్యాఖ్యలు చేసారు. జిహెచ్ఎంసి ఎన్నికలలో టీఆరెస్ పార్టీ ఎన్నికల నియమనిబంధలను తుంగలో తొక్కి ప్రచారాలు చేస్తుంది అని ఆయన మండిపడ్డారు.

రోడ్ షో లో ప్రభుత్వ వాహనాలను , ప్రభుత్వ మనుషులను పెట్టుకుని వేల జనాలను పోగు చేసుకుని షో చెయ్యటం జరిగింది  అని మండిపడ్డారు. కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా పోస్టర్లు కనిపిస్తున్న.. ఏమి చెయ్యట్లేదు అని మండిపడ్డారు. అవి తొలగించాలని మేము కోరటం జరిగింది  అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం లోనే టీఆరెస్ పార్టీ వ్యవహరిస్తున్నట్టు ఎవ్వరు వ్యవహరించలేదు అని ఆయన ఘాటుగా విమర్శలు చేసారు. ఎలక్షన్ కమిషన్ ని కూడా కెసిఆర్ ప్రభుత్వం వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు  అని మండిపడ్డారు.

కేసులు పెట్టాలనుకుంటే కెసిఆర్ మీద వందల కేసులు పెట్టొచ్చు అని ఆయన విమర్శించారు. బీజేపీ పార్టీ గెలుస్తుంది అనే భయం తో వారు ఇలా చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ఎంవిఎస్ ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ... తెరాస పార్టీ మంత్రి... కేటీఆర్ రెచ్చ గొట్టే ప్రసంగాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. తెరాస పార్టీ కి నియమాలు వర్తించవా .. బీజేపీ కి ఎందుకు అన్ని నియమనిభందనలు అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను భయపెడుతూ ప్రలోభాలకు గురిచేస్తూ తెరాస ప్రభుత్వం ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తుందని ఈసీ కి చెప్పడం జరిగింది అన్నారు. కెసిఆర్ మీద కేసు బుక్ చెయ్యాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: