తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు అసహనంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. అయితే ఎవరు ఉన్నారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది కీలక నేతలు మాత్రం ఇప్పుడు ఎక్కువగా అసహనంగా ఉన్నారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి ఇప్పుడు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని ఆయన చంద్రబాబు కి అత్యంత సన్నిహిత నేత అని అంటున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ నేతలు కూడా ఆయన పార్టీ మారతారా లేదా అనే దానిపై ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఆయన ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయినా దీనికి సంబంధించి త్వరలోనే ఓ క్లారిటీ రావచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే పార్టీలో ఉన్న వర్గ విభేదాలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అయితే సదరు నేతకు మరో నేతకు వర్గ విభేదాలు ఉన్నా సరే ఇప్పుడు పరిష్కరించే విధంగా అడుగులు వేయలేదు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట.

ఇదే విషయాన్ని పార్టీ పెద్దలు కూడా ఇటీవల ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఎప్పుడు పార్టీ మారతారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఆయనతో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే కూడా బయటకు వెళ్లే అవకాశం ఉంది. విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు కూడా ఇప్పుడు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు. వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అసహనంతో పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుందో చూడాలి. ఇక వీరితో చంద్రబాబునాయుడు ఇప్పుడు మాట్లాడుతున్నారని పార్టీ మారకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: