టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్న అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయే అని ఆయన స్పష్టం చేసారు. మెట్రోరైలు, పీవీ ఎక్స్ప్రెస్ వే,కృష్ణ జలాలు ఇలాంటి మరెన్నో తీసుకొచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ప్రజలు గమనించాలి అని సూచించారు. వరదలు వచ్చినపుడు వరద సహాయం పంది కొక్కుల్లా టీఆర్ఎస్ కార్యకర్తలు తిన్నారు అని ఆయన మండిపడ్డారు. 67 వేల కోట్లు హైదరాబాద్ కి ఖర్చు చేసాం అని కేటీఆర్ అంటున్నారని... ఒక్క రూపాయి అభివృద్ధి హైదరాబాద్ లో జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.

కరోన తో జనం చనిపోతుంటే కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో పడుకున్నాడు అని మండిపడ్డారు. కనీసం కరోనాని ఆరోగ్య శ్రీ లో పెట్టలేదన్నారు. వరదలతో జనం బాధలు పడుతుంటే కనీసం వాళ్ళ దగ్గరకి వెళ్ళి పరామర్శించలేదు సీఎం కేసీఆర్ అని ఆయన విమర్శించారు. బీజేపీ ఇప్పటివరకు ఒక్క రూపాయి తెలంగాణ కు ఇవ్వలేదని వ్యాఖ్యలు చేసారు. ఐటీ రీజియన్ రద్దైతే కూడా బండి సంజయ్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అడగలేదన్నారు. ఇవన్నీ తేలేని నాయకులు అర్ధరాత్రి దొంగల్లాగా వెళ్లి మా నాయకుల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అని విమర్శించారు.

వీరికి ఓటు అడిగే హక్కు లేదని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, జీఎస్టీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఇలా ప్రతి దానికీ మద్దతు పలికారు సీఎం కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు విషయంలో కూడా టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారన్నారు. మజ్లీస్ కూడా ఇలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు. జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్ సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ రోడ్ షో కు ఎల్ఈడీ లైట్స్ అనుమతినిచ్చారన్నారు. కానీ మేము అడిగితే ఎందుకు ఇవ్వడం లేదు అని నిలదీశారు. ఇలాంటి చర్యలని ఉపేక్షించం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: