ఆంధ్రప్రదేశ్ లో అధికారుల పనితీరు విషయంలో గత కొంతకాలంగా సీఎం జగన్ ఆగ్రహంగా ఉన్నారు అని ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. అయితే ఆయన ఎందుకు సీరియస్ గా ఉన్నారు ఏంటి అనేది తెలియదు. ఆదాయ మార్గాలను పెంచే విషయంలో కొంతమంది అధికారులు సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను ఎక్కువగా అమలు చేస్తున్నారు.

కాబట్టి ఆదాయ మార్గాలను పెంచాలి.  లేకపోతే కొన్ని కొన్ని ఇబ్బందులను ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సీఎం జగన్ అధికారుల పనితీరు విషయంలో ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు కాబట్టి అన్ని శాఖల నుంచి ఆదాయం అనేది ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు సీఎం జగన్ వారికి కొన్ని సూచనలు కూడా చేస్తున్నట్లుగా సమాచారం. అయితే కొంతమంది అధికారులు సమర్థవంతంగా వ్యవహరించడం లేదని ఆదాయం వచ్చే శాఖల మంత్రులతో సమన్వయం చేసుకోకుండా ఉన్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.

కొంతమంది అధికారులు సచివాలయం వద్దకు కూడా రావడం లేదు అని ఆందోళన పార్టీ వర్గాల్లో కూడా అవుతుంది. దీనితో సీఎం జగన్ ఇప్పుడు అధికారులకు నేరుగా వివరించడానికి రెడీ అవుతున్నారట. కొంతమంది అధికారులు పనిచేయడం లేదని దీంతో వారిని తప్పించి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అనే భావనను సీఎం జగన్ వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కొంతమంది కీలక శాఖల అధికారులను కూడా మార్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఎవరు వారు  ఏంటి అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: