ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో త్వరలోనే సినీ పెద్దలు కొంతమంది సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమాల షూటింగులు జరగడం లేదు అనే సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సినీ పరిశ్రమ ఆసక్తిగానే ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలు కొంతమంది సీఎం జగన్ ని తాడేపల్లి వెళ్లి కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా తర్వాత సినీ పరిశ్రమ చాలా దారుణంగా నష్టపోయింది సంగతి తెలిసిన.

దీనితో ఇప్పుడు సినీ పరిశ్రమను ఆదుకోవాలంటూ కొంతమంది సినీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రానికి చిరంజీవి అదేవిధంగా నాగార్జున సహా కొంతమంది సినీ పెద్దలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీరందరూ కూడా సీఎం జగన్ తో సమావేశమై సినీ పరిశ్రమ ఎంత వరకు నష్టపోయింది ఏంటి అనే అంశాలను ఆయనకు వివరించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఇస్తారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను పొందాలని సినిమా పరిశ్రమ భావిస్తోంది.

దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని కలిసే అవకాశం ఉంది. సీఎం జగన్ కూడా ఇప్పుడు సినీ పరిశ్రమ రాష్ట్రం లోకి రావాలి అని ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా కూడా అవకాశాలు కల్పిస్తామని ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని సీఎం జగన్ చెప్తున్నారు. దీంతో త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలు ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం పెరగాల్సిన సమయంలో సినీ పరిశ్రమ సహకారం అనేది ఎంతగానో కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. సీఎం కేసీఆర్ తో కూడా సమావేశమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: