ఇటీవలే ఫ్రాన్స్  తో వివాదం పెట్టుకున్న పాకిస్తాన్ కి ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ లో ఉన్న ఫ్రాన్స్ దౌత్యపరమైన కార్యాలయాన్ని ముట్టడించి  దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఫ్రాన్స్ ప్రస్తుతం దారుణంగా ఆంక్షలు విధిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకూ అయోమయంలో పడిపోతుంది. ఇక పాకిస్తాన్ వ్యవహరించిన తీరుతో ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన మీరజ్  యుద్ధ విమానాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ పాకిస్తాన్ కి అందించలేమూ  అంటూ ఇటీవల ఫ్రాన్స్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.



 పాకిస్తాన్ విషయంలో కఠిన ఆంక్షలు తెరమీదికి తీస్తూ పాకిస్తాన్ కి వరుసగా షాక్స్  ఇస్తూ వస్తుంది ఫ్రాన్స్. ఇప్పుడు మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్  కతర్ దేశానికి రఫెల్ యుద్ధ విమానాలను విక్రయించింది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం కతార్  దేశంలో రాఫెల్ యుద్ధ విమానాలు ట్రైనింగ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సైనికులు కతార్ లోని  రఫెల్  ను టెస్ట్ చేసేందుకు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఫ్రాన్స్ మరో షాక్ ఇచ్చింది.



 ఫ్రాన్స్ కు సంబంధించినటువంటి రఫెల్ ఉత్పత్తి సంస్థ అయినటువంటి ఢసాల్  సంస్థలో పని చేసే టువంటి పాకిస్తాన్ జాతీయులు  అందర్నీ కూడా తొలగించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది ఫ్రాన్స్. ఇక ఆ సంస్థ ప్రభుత్వ ఆదేశాలను వెంటనే ఆచరణలో పెట్టడం తో... దాదాపు మూడు వందల ఇరవై మంది వరకు పాకిస్తాన్ జాతీయులు ఉద్యోగం  నుంచి తొలగించబడ్డారు. అయితే చైనా తరహాలోనే పాకిస్థాన్ ఉద్యోగులు కూడా ఎంతో నమ్మకంగా పని చేస్తున్నట్లుగా నటిస్తూ ఎంతో కీలక సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది అని భావించిన  ఫ్రాన్స్ ఈ  నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: