మాజీమంత్రి , టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ గందరగోళంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఆయన 2019 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీలో చేరాలని చూస్తున్న, ఆయన ప్రయత్నాలు విఫలం అవుతూనే వస్తున్నాయి. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత వద్దామని ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఆయనకు చుట్టుముడుతూనే వస్తోంది. కొద్దిరోజుల క్రితమే గంటా కుమారుడు రవితేజ వైసీపీ కండువా కప్పుకోవడం, ఖాయం   అనుకున్న సమయానికి రకరకాల కారణాలతో అదికాస్తా వాయిదా పడింది.  రేపు మాపు అంటూ ఆయన వైసీపీలో చేరేందుకు ఎప్పుడూ ఏదో ఒక  అవాంతరం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఘంటా రాకను అడ్డుకునేందుకు విజయసాయి రెడ్డి వంటివారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఇప్పటికీ మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి వారు కారాలు మిరియాలు నూరుతూ వస్తున్నారు.



 విశాఖ జిల్లాలో పార్టీని పటిష్టం చేయాలని గంటా వంటి సీనియర్లు అవసరం ఎంతైనా ఉంటుందనే అభిప్రాయంతో జగన్ ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని, గం టా టార్గెట్ గా వ్యవహారాలు నడుస్తుండటంతో, అసలు ఎవరు చేస్తున్నారు ? ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే స్థానిక వైసీపీ క్యాడర్ మాత్రం గంటా పార్టీలోకి వస్తారని ఎదురు చూస్తున్నాయి. అయితే వైసీపీలో కి చేరే విషయమై గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన , ఆకస్మాత్తుగా విశాఖ భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారంలో గంటా ఇరుక్కున్నారు. 



గతవారం కృష్ణరాయపురం లో సుమారు 120 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించింది. వీటిలో 4.8 ఎకరాల భూమి గంటకు చెందినది. ప్రత్యూష కంపెనీ పేరు మీద 1997లో గంటా కొనుగోలు చేశారు. అది కూడా రాజకీయాల్లోకి రాకముందు. అయినా ఈ వ్యవహారంలో తనను ఇరికించడం పై ఫైర్ అవుతున్నారట. అయితే కొంతమంది తనను నెగిటివ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని పోతున్నారట.అయితే డిసెంబర్ ఒకటో తేదీన ఆయన పుట్టిన రోజు ఉండడంతో ఆ తర్వాత నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: